మళ్ళీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ.ఒకప్పుడు అద్భుత సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ గా మారాడు.

ఇప్పుడున్న చాలా మంది దర్శకులు ఆయన శిష్యులే.అయితే ఒకప్పటి వర్మ వేరు.

ఇప్పటి వర్మ వేరు.నారదుడికి నకిలీగా మారాడు.

నిత్యం ఏదో ఒక వివాదం లేనిదే ఆయనకు ప్రశాంతంగా నిద్ర పట్టదు.తాజాగా ఆయన పవన్ కల్యాణ్ మీద పడ్డాడు.

Advertisement

పవర్ స్టార్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నాడు.పనిలో పనిగా పవన్ అభిమానులకు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు.

తాజాగా పుష్ప సినిమా రిలీజ్ తర్వాత బన్నిని ప్రశంసల్లో ముంచెత్తాడు వర్మ.ఆయన తప్ప మరే హీరో ఈ పాత్ర చేయలేడని చెప్పాడు.

చిరంజీవి, పవన్ కల్యాణ్, రజనీకాంత్ కూడా ఈ పాత్రను చేయలేరన్నాడు.పుష్ప సినిమా తర్వాత చిరంజీవి ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ బంధువులని ఇండియా గుర్తు పెట్టుకుంటుందని కామెంట్ చేశాడు.

ఈ వ్యంగ్య ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

తాజాగా మరో ట్వీట్ తో పవన్ కల్యాణ్ ను ఈ వివాదంలోకి లాగాడు.అంతేకాదు.బన్నీ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవలు కలిగేలా పథకం వేశాడు.

Advertisement

వర్మ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.చక్కగా కలిసి ఉండే వ్యక్తుల మధ్య వర్మ లాంటి వ్యక్తులు గొడవలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

వాస్తవానికి పబ్లిసిటీ కోసం వర్మ ఏమైనా చేస్తాడు.బ్యూటీఫుల్ సినిమా కోసం హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లు పట్టుకని నానా హంగామా చేశాడు వర్మ.

ప్రస్తుతం అదే చీప్ ట్రిక్ మెగా ఫ్యామిలీ విషయంలో అప్లై చేస్తున్నాడు.అటు భీమ్లా నాయక్ సినిమాను కూడా ఇందులోకి లాగాడు.

ఇంటీరియర్ ఆంధ్రలో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ ఎందుకు కాదు? అంటూ ప్రశ్నించాడు.

అంతేకాదు.ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు ఎన్టీఆర్, రాంచరణ్ పాన్ ఇండియన్ స్టార్స్ అయినా.మీరు ఇంకా తెలుగును పట్టుకుని వేలాడ్డం ఏంటని ప్రశ్నించాడు.

దయచేసి భీమ్లా నాయక్ ను పాన్ ఇండియా రేంజికి తీసుకెళ్లి సబ్ కా బాప్ అని ఫ్రూవ్ చేయాలని కోరాడు.అటు వర్మ కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

చీప్ ట్రిక్స్ మానుకోవాలని చెప్తున్నారు.

తాజా వార్తలు