రజనీకాంత్ ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు.
ఇప్పటికీ ఈ యువ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు.
ఇక రజనీకాంత్ ఒక్కసారి తెరమీద కనిపించారు అంటే చాలు ప్రేక్షకులు అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు.అంతలా క్రేజ్ సంపాదించుకున్నారు రజినీకాంత్.
అయితే అంత పెద్ద హీరో అయినప్పటికీ ఎప్పుడూ అందరితో సరదాగా ఉంటూ నవ్వుతూ కనిపిస్తారు రజినీకాంత్.ఇకపోతే రజినీకాంత్ లత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే.
ఇక వీరిద్దరి కలయిక పరిచయం ఆ తర్వాత పెళ్లి కూడా అచ్చంగా సినిమాలో జరిగినట్లుగానే జరిగింది.1980లో సినిమా షూటింగ్లో ఉన్నారు రజినీకాంత్.ఆ సమయంలో కాలేజీ మ్యాగజైన్ కోసం రజిని ఇంటర్వ్యూ కోసం వచ్చారు లత.ఇంటర్వ్యూ సందర్భంగా తమ అభిరుచిలు ఒకటే అన్న విషయాన్ని గ్రహించారు రజిని.ఇక ఇంటర్వ్యూ అయ్యాక వెంటనే లతా దగ్గరికి వెళ్లి పెళ్లి ప్రపోజల్ చేశారట.
పెద్ద హీరో అయిన రజినీకాంత్ అలా పెళ్లి ప్రపోజల్ చేయడంతో మొదట షాక్ అయ్యారట లత.కానీ ఆ తర్వాత ఆనందపడి పేరెంట్స్ తో మాట్లాడాలి అని చెప్పారట.
ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులతో లతా పేరెంట్స్ మాట్లాడించిన రజనీకాంత్.ఇక ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 1981 ఫిబ్రవరి 26వ తేదీన లత ను పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్ళి అయ్యి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటింది.
వీరికి ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇకపోతే పెద్ద కూతురు ఐశ్వర్య ఇటీవలే తన తల్లిదండ్రుల అనుబంధానికి సంబంధించి ఒక మెమొరబుల్ ఫోటోని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
రజినీకాంత్ ముఖంపై రెడ్ కలర్ లిప్ స్టిక్ తో లత పెయింటింగ్ వేస్తోంది పూర్తిగా కళ్లచుట్టూ గుండ్రంగా లిప్ స్టిక్ తో గీసింది లత.ఆ సమయంలో రజనీకాంత్ సరదాగా నవ్వుతూ ఉన్నాడు.ఇక ఇది చూసిన తర్వాత రజనీకాంత్ లత ఎంత అన్యోన్యంగా ఉండేవారు అర్థం అవుతుంది అని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy