బీజేపీ లో 'ఈటెల ' చేరారు సరే ... భవిష్యత్తు ఏంటి ? 

ఎన్ని ట్విస్ట్ లు చోటు చేసుకుంటే  ఏంటి బీజేపీ మనిషిగా ఈటెల రాజేందర్ ముద్ర వేయించుకున్నారు.తనతో పాటు అనేకమంది కీలక నాయకులను ఆయన వెంట తీసుకు వెళ్ళారు.

 Rajender-who Has Joined The Bjp Is In Trouble In The Coming Days Itela Rajender,-TeluguStop.com

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, ఆర్టీసీ సంఘం నేత అశ్వత్థామ రెడ్డి, తదితరులు బిజెపిలో చేరిపోయారు.వీరే కాకుండా మరెంతో మంది నాయకులను ఈటెల రాజేందర్ బీజేపీలో చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేపట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడమే కాకుండా,  బీజేపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పదేపదే రాజేందర్ చెప్పుకొస్తున్నారు.బిజెపి అగ్ర నాయకత్వం నుంచి అన్ని రకాలుగా హామీని పొంది బీజేపీ లో చేరిన రాజేందర్ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంటుందనే విషయంపై అందరిలోనూ అనేక సందేహాలు కలుగుతున్నాయి.

రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం,  స్పీకర్ దానిని వెంటనే ఆమోదించడం జరిగిపోవడంతో హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

అయితే కమ్యూనిజం భావజాలం ఉన్న రాజేందర్ బిజెపిలో చేరడాన్ని మెజారిటీ తెలంగాణ వాదులు తప్పు పడుతున్నారు.

ఈటెల రాజేందర్ స్వతంత్రంగా పోటీ పడితే బలపరిచే వాళ్ళమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది.బిజెపిలో చేరిన టిఆర్ఎస్ నుంచి అనేక రాజకీయ ఇబ్బందులను రాజేందర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈటెల రాజేందర్ కు చెందిన హుజూరాబాద్ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండటం మరింత ఇబ్బంది అవుతుందనే అంచనాలు ఉన్నాయి.బిజెపి ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతోంది.

Telugu Bandi Sanjay, Itela Rajender, Kishan Reddy, Carrer Etala, Telangana, Ts P

ఆ పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు గుర్తింపు కోరుకుంటూ , తామే తెలంగాణ బిజెపిలో సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, వంటి వారి గ్రూపులు బిజెపి లు ఉన్నాయి.పైకి అంతా బాగానే ఉన్నట్లు గా కనిపిస్తున్నా, తెరవెనుక గ్రూపు రాజకీయాలు బీజేపీని వేధిస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Itela Rajender, Kishan Reddy, Carrer Etala, Telangana, Ts P

ఇప్పుడు ఈటెల రాజేందర్ వంటి బలమైన నాయకులు అది కూడా పెద్ద ఎత్తున అనుచరులతో చేరినా, ఆయన తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని తన సత్తా చాటుకోవాలని చూస్తారు.ఈ క్రమంలో ఆయనకు సొంత పార్టీ బీజేపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.అది కాకుండా ఒక్కసారిగా బిజెపి విధానాలను అలవాటు చేసుకోవడం రాజేందర్ కు ఇబ్బందికరంగానే ఉంటుంది.

ఎలా చూసుకున్నా బీజేపీ లో గ్రూపు రాజకీయాలు మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube