పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల తో కానీ పోవు అన్నది ఒక ప్రముక ఒక సామెత….ఈ సామెత అచ్చం గా బిజేపి ( BJP ) బహిస్కృత నేత రాజా సింగ్ కు( Raja Singh ) సరిపోతుంది ….
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాజా సింగ్ ఫై మరో కేసు నమోదు అయింది… మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరం వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ గత సంవత్సరం ఆగస్టులో అరెస్టు అయ్యారు.చాలా కాలం జైల్లో గడిపిన ఆయన షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చారు .ఇంట బయట తీవ్ర విమర్శలు వచ్చిన ఆయనపై భాజపా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది.పార్టీ నుంచి సస్పెండ్ చేసింద.
ఇంత జరినా కూడా ఆయన తన తీరు మార్చుకోలేదు.ఇటీవల బెయిల్ పై విడుదలైన రాజాసింగ్ మహారాష్ట్రలో ( Maharashtra ) జరిగిన ఒక సభావేశంలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జనవరి 29న సకల సమాజ్ హిందూ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఒక మతం కారణంగా తమ హిందూ సమాజ కుమార్తెలుం, బాలికలు, సమిదలుగా మారుతున్నారని హిందూ సమాజం మొత్తం ఒక మతానికి వ్యతిరేకంగా నిలబడవలసిన సమయం ఆసన్నమైంది అంటూ ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు .లవ్ జిహాద్ పేరుతో తమ వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారని , మైనారిటీ సభ్యుల నిర్వహించే ప్రతి వ్యాపారాన్ని అడ్డుకోవాలని వారికి నష్టం కలిగించాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గతంలో ఆయన అరెస్టుపై బెయిల్ ఇచ్చేటప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆయనకు గుర్తు రానట్లే ఉంది.

అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని, మత విశ్వాసాలు రెచ్చగొట్టకూడదని షరతుతో కూడిన బెయిల్ రాజసింగ్ కు మంజూరు చేసింది .తనకు వచ్చిన నోటీసుల పై రాజాసింగ్ కూడా స్పందించారు.తన ఎప్పుడు ధర్మం వైపే నిలబడ్డానని కోర్టు తీర్పులు తనకు వ్యతిరేకంగా వచ్చిన కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆయనపై నమోదు అయిన కొత్త కేసుల విషయంలో పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందు ముందు ముందు తెలుస్తుంది.
ఏది ఏమైనా అతిఎ ఎన్నడూ మంచిది కాదు.వ్యక్తిగత మత విశ్వాసాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజా శ్రేయస్సు పరమావధిగా రాజకీయ నాయకుల ప్రవర్తన ఉండాలి.మరి తరచూ గీత దాటేలా మాట్లాడుతున్న రాజా సింగ్ లాంటి విషయంలో కోర్టుల అంతిమ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.`
.






