ప్రభాస్( prabhas ) హీరోగా నటిస్తున్న హిందీ చిత్రం ఆదిపురుష ఈ జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ రామాయణ ఇతివృత్త సినిమా టీజర్ ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచిన విషయం తెలిసిందే.
నిన్న శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్ చిత్ర యూనిట్ సభ్యులు మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు అనే ప్రచారం జరిగింది.కానీ కేవలం పోస్టర్ తోనే సరిపెట్టారు అంటూ అభిమానులు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేయడంతో పాటు పోస్టర్ పై రకరకాలుగా కామెంట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ మాత్రం దానికి ఇంత హడావిడి అవసరమా అంటూ దర్శకుడి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.టీజర్ విడుదల తర్వాత సినిమా పై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.
ఆ విమర్శలని తిప్పి కొట్టేందుకు మరో టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుంది కదా అంటూ కొందరు ప్రభాస్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ ఇప్పటి వరకు దర్శకుడు ఆ విషయమై ప్లాన్ చేయడం లేదని తెలుస్తుంది.

ఒకవేళ సినిమా టీజర్ విడుదల చేస్తే మరింతగా సినిమాకు డ్యామేజ్ అయ్యే అవకాశం లేక పోలేదని కొందరు అభిప్రాయం చేస్తున్నారు.అందుకే దర్శకుడు సినిమా టీజర్ విడుదల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.టీజర్ విడుదల తర్వాత మరోసారి విమర్శలు వస్తే సినిమా కు మరింతగా డ్యామేజ్ ఖాయం, అందుకే సినిమా విడుదల సమయం లోనే ట్రైలర్ విడుదల చేస్తే సరిపోతుందని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.మరి కొందరు మాత్రం ప్రమోషన్ లేకుండా సినిమా ను ఎలా విడుదల చేస్తారని పెదవి విరుస్తున్నారు.
మొత్తానికి ఆదిపురుష్ విషయం లో అభిమానుల ఆలోచన ఒకలా ఉంటే.చిత్ర యూనిట్ సభ్యుల ఆలోచన మరువలా ఉంది.విడుదల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్న పిల్లల సినిమా మాదిరిగా గ్రాఫిక్ సినిమా అంటూ ఇప్పటికే విమర్శలు వచ్చాయి.ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా గ్రాఫిక్స్ ఉంటుందా అనేది చూడాలి.