అక్రమంగా తరలిస్తున్న 28 క్విటాళ్ల పిడిఎస్ రైస్ ను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan) ఆదేశాల మేరకు శనివారం ఉదయం టాస్క్ ఫోర్స్ ఎస్.

ఐ మారుతి తన సిబ్బంది తో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం నుండి ఇతర ప్రాంతాలకు తరలించడానికి టీఎస్ 36 టిఏ 2494 (18 క్వింటల్లు ) ,ఏపీ 36 ఎక్స్ 2091 (10 క్వింటల్లు ) నెంబర్ గలా ఆటోలలో) కడమంచి కనకరాజు ఎల్లారెడ్డిపేట్( Yellareddypet ),తౌడ శ్రీకాంత్,పెద్ద చీకోడ్,పర్వతం సంతోష్ , పెద్దలింగపూర్,కడమంచి గట్టయ్య,నామపూర్ వారు ప్రభుత్వ రేషన్ బియ్యంను ఆటోలో ఎక్కిస్తుండగా ఉదయం అందజ 05 గంటల ప్రాంతంలో వారిని కడమంచి గట్టయ్య ఇంటి వద్ద పట్టుకొని ఆటోలు, రేషన్ బియ్యం ను స్వాధీన పరుచుకొని వారిని అదుపులోకి తీసుకోని తదుపరి చర్యల నిమిత్తం వారిని మరియు ఆటోలను,పిడిఎస్ రైస్ ను ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది.

ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్( Task Force Police) ఎస్.ఐ లు మాట్లాడుతూ పేదలకు అందవలసిన ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇట్టి టాస్క్ లో టాస్క్ఫోర్స్ సిబ్బంది రాజేష్, తిరుపతి,మహిపాల్,శ్రీనివాస్ పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News