టాప్ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పిన రాజమౌళి

బాహుబలి సీరీస్ లో శివగామి పాత్ర కోసం మొదట రమ్యకృష్ణ కి బదులుగా అలనాటి అందాల నటి శ్రీదేవిని అనుకున్న సంగతి విదితమే.

కథ రాసుకోగానే మొదట రమ్యకృష్ణ పేరునే పరిశీలించిన జక్కన్న, ఆ తరువాత బాలివుడ్ లో మార్కెట్ పెంచడం కోసం శ్రీదేవిని సంప్రదించారు.

అయితే శ్రీదేవి ప్రాజక్ట్ ని రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ కాస్త మళ్ళీ రమ్యకృష్ణ చేతికే వచ్చింది.ఈ విషయం మీద స్పందించిన రాజమౌళి శ్రీదేవి మీద కొన్ని సంచలన కామెంట్స్ చేసారు.

శ్రీదేవి శివగామి పాత్ర కోసం 7-8 కోట్ల రెమ్యునరేషన్ అడగటమే కాకుండా, ప్రతి ప్రయాణానికి బిజినెస్ క్లాస్ టికెట్లు, హైదారాబాద్ లో అతిపెద్ద హోటల్స్ లో వసతి, వీటన్నిటితో పాటు ఏకంగా హిందీ వెర్షన్ లాభాల్లో వాటా అడిగారని, అనవసరం అనిపించి ఆమెని వదిలేశామని, అదే సినిమాకి ప్లస్ అయ్యిందని రాజమౌళి తన ఇంటర్వ్యూలో చెప్పడం మీరు చూసే ఉంటారు.జక్కన్న వ్యాఖ్యలకు నొచ్చుకున్న శ్రీదేవి ఒక డైరెక్టర్ ఒక ఆరిస్టు పారితోషికం గురించి పబ్లిక్ గా మాట్లాడటం సంస్కారం కాదని, అన్నేసి డిమాండ్లు అడిగేదాన్ని అయితే 300 సినిమాలు చేసేదాన్ని కాదని, ఇంతకుముందు ఎన్నో హిట్ సినిమాలు వదులుకున్నా, ఏ దర్శకుడు కూడా నా గురించి ఇలా మాట్లాడలేదని శ్రీదేవి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

ఈ వివాదం స్పందిస్తూ " ఎవరి మాటాలు నమ్మాలి అనేది నేను ప్రేక్షకులకే వదిలేస్తున్నాను.కాని నేను పబ్లిక్ గా డీటెయిల్స్ మాట్లాడటం తప్పే.

Advertisement

నేను అలా అనాల్సింది కాదు.ఆ కామెంట్స్ పట్ల చింతిస్తున్నాను.

నాకు శ్రీదేవి అంటే చాలా గౌరవం.ముంబైలో దక్షిణాది సినిమా పేరుని కొన్నేళ్ళు మోసింది ఆవిడే.

ఆమె నటించిన మామ్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు రాజమౌళి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు