అమెరికాలో వివక్షకు గురవుతున్న ఆసియా ఆహారం.. పడిపోతున్న వ్యాపారం

అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోనే ఆసియాకు చెందిన ఆహార పదార్ధాలు, వ్యాపారాలు జాతి వివక్షకు గురవుతున్నాయి.కోవిడ్ వైరస్ చైనాలో పుట్టడమే దీనికి కారణం.

గబ్బిలాల నుంచి కరోనా వ్యాప్తి చెందినట్లు కొన్ని ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి.అటు నుంచి వుహాన్‌లోని మాంసం మార్కెట్ల నుంచి మనిషికి సోకిందని ప్రపంచంలోని చాలా దేశాలు వాదిస్తున్నాయి.

వైరస్ వ్యాప్తికి చైనీయుల ఆహారపు అలవాట్లే కారణమని వివిధ దేశీయులు ఆరోపిస్తున్నారు.అంతటితో ఆగకుండా చైనీయులను స్థానికులు టార్గెట్ చేస్తున్నారు.

అగ్గికి ఆజ్యం పోసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చైనా వైరస్ అని వ్యాఖ్యానించడం అమెరికన్లకు మరింత నూరిపోసినట్లయ్యింది.వైరస్‌కు పుట్టినిల్లుగా చెబుతున్న వుహాన్ మార్కెట్‌లోని వన్యప్రాణుల నుంచి సేకరించిన 33 శాంపిల్స్‌‌లో 31 కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

అయితే వన్యప్రాణులు లేదా ఇతర జీవుల మాంసాన్ని ఆధునిక ఆసియన్లు లేదా అమెరికన్లు ఆహారంగా తీసుకోరు.జాతి వివక్షకు సంబంధించి అమెరికన్ న్యాయవాద అసోసియేషన్ (ఏఏపీఐ) ఆగస్టులో ఒక నివేదికను విడుదల చేసింది.

దీని ప్రకారం మార్చి నుంచి దేశవ్యాప్తంగా 2,500 వివక్ష తరహా ఘటనలు చోటు చేసుకున్నట్లు నివేదించింది.ఆ సమయంలో అమెరికాలో 47 రాష్ట్రాల నుంచి ఈ డేటా సేకరించింది.

వీటిలో 46 శాతం సంఘటనలు కాలిఫోర్నియాలో నమోదవ్వగా, ఆ తర్వాత 14 శాతం న్యూయార్క్‌లో చోటు చేసుకున్నాయి.

దీనికి అదనంగా, మహమ్మారి సమయంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా ఆసియా అమెరికన్‌లకు చెందిన వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 22 శాతం వ్యాపారాలు క్షీణించినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ అధ్యయనం తెలిపింది.ఇక ఆసియా ఆహార పదార్ధాలను అసభ్యంగా దూషించడంతో పాటు సోషల్ మీడియాలో సైతం అమెరికన్లు సెటైర్లు వేశారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

మాస్టర్ చెఫ్: ది ప్రొఫెషనల్స్ కంటెస్టెంట్ ఫిలి ఆర్మిటేజ్ మాటిన్ ఆసియా వంటకాలను దూషిస్తూ ‘‘ డర్టీ ఫుడ్ రిఫైన్డ్ ’’ అనే పదంతో #prettydirtyfood అనే హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్ చేశారు.అయితే దీనిపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌కు గురికావడంతో ఆర్మిటేజ్- మాటిన్‌ ఇన్‌స్టా బయో మార్చడంతో పాటు క్షమాపణలు కోరింది.అయితే ఆసియా ఆహారాన్ని, అలవాట్లను అమెరికన్లు దూషించడంతో ఈనాటిది కాదు.1850ల నాటికే ఈ జాడ్యం వుందని ఇండియానా యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ ఎల్లెన్ వు అన్నారు. చైనా ప్రజలు ఎలుక లేదా కుక్క మాంసాన్ని తింటారనే తప్పుడు భావన చైనా నుంచి వచ్చిన వలస కార్మికులకు తీరని దు:ఖాన్ని మిగిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు