సినిమా నచ్చని పక్షంలో డబ్బులు వాపస్ అంటున్న పీవీఆర్ ఐనాక్స్.. సాధ్యమవుతుందా?

మామూలుగా మనం సినిమా( manam movie ) థియేటర్ కి వెళ్ళినప్పుడు సినిమా నచ్చితే పూర్తిగా అయిపోయే వరకు అక్కడే ఉండి సినిమాలు చూస్తాం.

ఒకవేళ సినిమా నచ్చకపోతే మధ్యలోనే వెళ్లిపోతూ ఉంటాం.

కొంతమంది టికెట్ కు పెట్టిన డబ్బులు గుర్తు వచ్చి అలాగే సినిమా థియేటర్లో ఆఖరి వరకు ఉండి చూస్తూ ఉంటారు.ఇష్టం లేకపోయినప్పటికీ చివరి దాకా కూర్చుంటూ ఉంటారు.

అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పీవీఆర్ ఐనాక్స్ ఒక కొత్త ప్లాన్ వేసింది.ఒకవేళ మీరు వాళ్ళ మల్టీప్లెక్సు నుంచి మధ్యలో వెళ్లిపోవాలనుకుంటే అప్పటి దాకా చూసిన సమయాన్ని లెక్క వేసి మిగిలింది రీ ఫండ్ చేస్తారట.

కాకపోతే ముందు టికెట్ కొనే సమయంలో అసలు రేట్ కన్నా పది శాతం అదనంగా కట్టి తీసుకోవాలి.అంటే ఉదాహరణకు 400 రూపాయలు టికెట్ అనుకుంటే 40 ఎక్స్ ట్రా ( 40 extra )పెట్టాలి.మొత్తం చూస్తే ఏం వెనక్కు ఇవ్వరు.

Advertisement

ప్రస్తుతం ఢిల్లీలో( Delhi ) ఇదే ప్రయోగిస్తున్నారు.ఇదేదో బాగుందని సంబరపడేందుకు లేదు.

ఎందుకంటే నగరాల్లో ముందస్తుగా సమయాన్ని ప్లాన్ వేసుకుని టికెట్లు బుక్ చేసుకుని థియేటర్ దాకా వెళ్లినోళ్లు గుడ్డో బ్యాడో చివరి దాకా ఉంటారు.పైగా అదనంగా డబ్బు కట్టాలి కాబట్టి ఎందుకు వేస్ట్ చేసుకోవడమని రిస్క్ చేయరు.

అలాంటప్పుడు ఇది వర్కౌట్ కాదు.

ముఖ్యంగా ఫ్యామిలీస్ ( Families )ఇలాంటి విషయంలో రిస్క్ అస్సలు చేయరు.సింగల్ గా వెళ్లే మూవీ లవర్స్ కు కొంత ప్రయోజనం ఉంటుంది.ఇదంతా ఆలోచించే ప్రేక్షకుల మనస్తత్వాన్ని కాచి వడబోసి పీవీఆర్ ఐనాక్స్ ఈ పథకాన్ని రూపొందించింది.

పవర్ స్టార్ పవన్ అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న శ్రియారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఎక్కువమంది పిల్లలను కనాలని ఉంది.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ఎంతమేరకు సక్సెస్ అవుతుందో కొద్దిరోజుల దాకా వేచి చూడాలి మరి.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ పథకం చెత్తగా ఉంది అంటూ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఒకవేళ థియేటర్ మధ్యలో నుంచి వచ్చినా ఏ 100 లేదా 50 వస్తాయి తప్ప పెద్దగా ఏమి రావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు