Rashmika Mandanna Pushpa 2 : తెలుగు ప్రేక్షకులకు శ్రీవల్లి దూరం అవుతుందా? ఆ ఒక్కటి తప్ప కనిపించదే!

కన్నడ బ్యూటీ రష్మిక మందన పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ట్ డం దక్కించుకునే విషయం తెలిసిందే.

ఆ సినిమా తో పాటు మరికొన్ని సినిమా లు కూడా ఈమె నటించగా సూపర్ హిట్ అయ్యాయి.

దాంతో ఏకంగా ఈమె తన పారితోషికాన్ని కోటిన్నర రెండు కోట్ల నుండి నాలుగు కోట్లకు పెంచేసింది.నాలుగు కోట్ల రూపాయలు ఇస్తే తాను సినిమాకు సైన్ చేస్తానంటూ భీష్ముంచుకు కూర్చుందట.

దాంతో ఈ అమ్మడి సినీ కెరియర్ ప్రమాదం లో పడ్డట్టు అవ్వబోతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు సినిమా హీరోలు మరియు దర్శక నిర్మాతలు హీరోయిన్ కి ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు.

ఆ విషయం ఇప్పటికే అర్థమైంది.ఎక్కువ పారితోషికం డిమాండ్‌ చేస్తే వారిని పక్కన పెట్టడం పరీ పాటిగా వస్తుంది.

Advertisement
Pushpa Heroine Rashmika Mandanna Remuneration For Next Films , Bollywood News,P

కనుక రష్మిక ని కూడా అతి త్వరలోనే పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

Pushpa Heroine Rashmika Mandanna Remuneration For Next Films , Bollywood News,p

పెద్ద ఎత్తున రష్మిక యొక్క అందాల ఆరబోత మనం చూస్తూనే ఉన్నాం, ఆమె తన అందంతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.సౌత్ లో ఆమెకు నాలుగు కోట్ల రూపాయల పారితోషికంను ఇచ్చేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించే అవకాశం లేదు.ఒకటి రెండు సినిమాలు మినహా ఆమె పుష్ప తర్వాత వరుసగా సినిమాలు చేస్తుందని నమ్మకం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వేళ సౌత్ నుండి వరుసగా ఆఫర్స్ రాకపోతే పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అవ్వాలని ఈమె భావిస్తుందట.ఒక వేళ బాలీవుడ్ లోనే ఈమె సినిమా లు చేస్తే ఆ సినిమా లను తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ చేసుకుని ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.

పారితోషం తగ్గించుకుంటే టాలీవుడ్ లో ఈ అమ్మడి కెరీర్‌ కొన్నాళ్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయని కొందరు సూచిస్తున్నారు.మరి ఆమె పారితోషికంను తగ్గించుకుంటుందా లేదా అనేది చూడాలి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు