ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పుష్ప.మొదటి రోజు నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.
ఈ సినిమా భారీ అంచనాలతో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది.ఇక వసూళ్ళ పరంగా కూడా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది ఈ సినిమా.
ఇక ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు ప్రాణం పోశారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఫహద్ ఫాసిల్, అనసూయ,సునీల్ లాంటివారు కనిపించింది కొంతసేపే.
కానీ అటు అల్లు అర్జున్ తో పాటు సినిమా మొత్తం కనిపించింది మాత్రం ఒక కొత్త ఆర్టిస్ట్ కావడం గమనార్హం.తన నటనతో సినిమా చూస్తున్న ప్రేక్షకులని ఆకర్షించాడు కేశవ పాత్రలో నటించిన కుర్రాడు.
దీంతో ఈ కుర్రాడు ఎవరు అబ్బ అంటూ వెతకడం ప్రారంభించారు అందరు.అతని పేరే జగదీష్ వరంగల్ కు చెందిన కుర్రాడు.
అయితే పలాస సినిమాలో శ్రీకాకుళం యాస లో అదరగొట్టి తన నటనకు మంచి మార్కులు వేసుకున్నాడు.ఇటీవలే పుష్ప లో చిత్తూరు యాసలో ఇరగదీసి తన నటనతో అందరిని ఆకర్షించాడు.
పుష్ప సినిమాలో కేశవ పాత్రలో నటించిన జగదీశ్ ఇటీవల మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.

సాధారణంగా ఒక స్టార్ హీరోతో కలిసి పనిచేయడం మామూలు విషయం కాదు బన్నీ సార్ తో కలిసి పని చేస్తున్నప్పుడు అలాగే అనిపించింది.అయితే ఎన్నో రోజుల నుంచి బన్నీ సార్ సినిమాలు చూసుకుంటూ పెరిగాను.అలాంటిది బన్నీ సార్ సినిమాలో అవకాశం రావడం ఎంతో ఆనందంగా అనిపించింది.
అయితే ఇంతకు ముందు చేసిన సినిమాల్లో అనుభవం ఈ సినిమాలో బాగా ఉపయోగపడింది అని చెప్పాలి.

ఇంతకు ముందు నా నటన కారణంగానే ఇప్పుడు ఈ సినిమాకు సెలెక్ట్ అయ్యానేమో.ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మానాన్న కూడా ఎంతో సంతోషపడ్డారు.సినిమాలో సెలెక్ట్ అయ్యాను అని తెలిసినప్పుడు ఏదో ఒక సీన్లో మాత్రమే కనిపిస్తా అని మా ఊరి వాళ్ళు అనుకున్నారు.
కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా మొత్తం కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు అంటూ జగదీష్ చెప్పుకొచ్చాడు.