తమ్ముడా.. ఎదురెళ్లి దూకేయ్.. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ దర్శకులలో పూరీ జగన్నాథ్( Puri Jagannath ) ఒకరు.

ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ సక్సెస్ రేట్ తగ్గినా ఈ డైరెక్టర్ ను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం ఎక్కువగానే ఉన్నారు.

పూరీ జగన్నాథ్ సినిమాలలో డైలాగ్స్ కూడా కొత్తగా ఉంటాయనే సంగతి తెలిసిందే.పూరీ జగన్నథ్ తాజాగా ఎండ్ లెస్ బ్యాటిల్( Endless Battle ) పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేశారు.

ఆ వీడియోలో పూరీ జగన్నాథ్ చేసిన కామెంట్లు ఆకట్టుకుంటున్నాయి.అనంత మహాసముద్రం.

అరుస్తున్న కెరటాలు.అదుపుతప్పిన గాలులు.

Advertisement

అలలపై కలల మధ్య గుంపులుగా జనం అని పూరీ పేర్కొన్నారు.ఎలాగూ పోతామని తప్పించుకునే దారే లేదని ఆయన చెప్పుకొచ్చారు.

అందుకే పోయే ముందు బ్రతుకుదామని అనుభవిద్దామని ఆస్వాదిద్దామని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.ఇంకా నడి మధ్యనే ఉన్నామని ఇంకెంత దూరమో ఈ ప్రయాణం అని ఆయన వెల్లడించారు.

గత ప్రయాణం అదొక కథ అని రేపటి ప్రయాణం మరొక కథ అని ఆయన వెల్లడించారు.పిట్ట కథలు మనకెందుకని ఇప్పుడే ఇక్కడే బ్రతికేద్దామని పూరీ జగన్నాథ్ అన్నారు.మళ్లీ మబ్బులు.

చంపుకొని తినే వానలు అని ఇది వానో పెను తుపాను అనో అని ఆయన వెల్లడించారు.ఈరోజు ఆకలితో కడుపు మాడితే రేపటి వేట తీరు వేరే విధంగా ఉంటుందని పూరీ అన్నారు.

పెళ్లి తర్వాత భార్య గురించి శ్రీసింహా పోస్ట్.. ఆరేళ్లుగా తాను ప్రేమలో ఉన్నానంటూ?
ఈ ప్రశ్నలకు సమాధానాలేవి బన్నీ.. మూవీ చూడాలంటే అలా చేయడం సాధ్యం కాదా?

అమ్మ వద్దన్నా దేవుడే అడ్డొచ్చినా పులులై దూకేద్దామని సింహాలై గర్జిద్దామని ఆయన వెల్లడించారు.ఇది అనంత యుద్ధ సంగ్రామమని అందరితో యుద్ధం చేస్తే అలెగ్జాండర్ అని తనలో తానే తలపడితే గౌతమ బుద్ధ సిద్దార్థ అని చెప్పుకొచ్చారు.ఇక్కడ యుద్ధం అనివార్యమని తలలు నరకుతావో తలే నరుక్కుంటావో తమ్ముడా అంటూ పూరీ జగన్నాథ్ తన వీడియోను ముగించారు.

Advertisement

తాజా వార్తలు