Soybean crop : సోయా చిక్కుడు పంటను ఆశించే కాండం తోలిచే పురుగులను అరికట్టే యాజమాన్య పద్ధతులు..!

కూరగాయ పంటలలో సోయాచిక్కుడు( Soya Chikkudu ) పంట కూడా ఒకటి.సోయా చిక్కుడు పంట సాగు చేస్తే భూసారం పెరుగుతుంది.

నల్లరేగడి నేలలలో వర్షాధార పంటగా సోయాచిక్కుడును సాగు చేయవచ్చు.ఇతర కూరగాయ పంటలతో పోలిస్తే శ్రమతో పాటు పెట్టుబడి వ్యయం తక్కువగా ఉంటుంది.

ఈ పంటను నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చు.ఏ పంట సాగుచేసిన అధిక ప్రాధాన్యం సేంద్రియ ఎరువులకు మాత్రమే ఇవ్వాలి.

ఇప్పుడే నేల భూసారం కోల్పోకుండా ఉంటుంది.సోయా చిక్కుడు సాగు చేసే నేలలో ఒక ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువు( Cattle manure ), 25 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్( Murate of Potash ) ఎరువులు చివరి దుక్కిలో వేసి కలియదున్నాలి.

Advertisement

విత్తనానికి ముందు నేల వదులు అయ్యేవరకు రెండు లేదా మూడుసార్లు దున్నుకోవాలి.సోయా చిక్కుడు పంటలో అత్యంత కీలకం విత్తన సేకరణ.

మొలక శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన కొత్త విత్తనాన్ని ఎంచుకోవాలి.విత్తన మొలక శాతాన్ని అంచనా వేయడం కోసం మనం ఎంచుకున్న విత్తనంను నేల మీద ఒక ప్రదేశంలో విత్తుకోవాలి.

ఏడు నుంచి పది రోజులలో మొలకలు వస్తాయి.అందులో 70% కి పైగా విత్తనాలు మొలకెత్తితే ఆ విత్తనం ఎత్తుకోవడానికి అనుకూలం అని చెప్పవచ్చు.

ఒకవేళ 70% కన్నా తక్కువగా మొలకలు వస్తే ఆ విత్తనాన్ని మార్చుకోవాలి.

విరుపాక్ష తర్వాత సంయుక్త మీనన్ కి ఏమైంది ? ఆమె జోరు ఎందుకు తగ్గిపోయింది ?
పురుషులు తలస్నానం చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ను పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు!

నేలలో తేమ ఉన్న సమయంలో సోయా చిక్కుడు విత్తనం విత్తుకోవాలి.జూన్ మొదటి వారం నుండి జూలై మొదటి వారం మధ్య విత్తుకోవడానికి అనుకూలమైన సమయం.ఒక కిలో విత్తనాలను మూడు గ్రాముల కాప్టన్( Captain ) తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత మొక్కల మధ్య ఎనిమిది సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 40 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

కూరగాయ పంటలకు చీడపీడల, తెగుళ్ల బెడద ( Pests )కాస్త ఎక్కువే.కాబట్టి కూరగాయ పంటలను సాగు చేసే రైతులు పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే తొలి దశలోనే గుర్తించి అరికట్టాలి.సోయాచిక్కుడు పంటకు కాండం తొలిచే పురుగుల బెడద చాలా ఎక్కువ.ఈ పురుగులను పొలంలో గుర్తించిన తర్వాత వెంటనే ఒక లీటరు నీటిలో 1.6మిల్లీలీటర్ల ఎసిఫేట్ ను కలిపి పిచికారి చేయాలి.

తాజా వార్తలు