అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధం.. మంత్రి ధర్మాన

వికేంద్రీకరణకు మద్ధతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ కలిసి విశాఖ గర్జన భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా వేదిక వద్ద మంత్రి ధర్మాన మాట్లాడారు.

ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని చెప్పారు.ఈ క్రమంలో అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

అందరం కలిసి మన వాదనలను దేశమంతా బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు.విశాఖలో అరిస్తే అమరావతిలో వినిపించాలని అన్నారు.

విశాఖ పరిపాలనా రాజధాని కోసం రాజకీయ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు