బాత్ టాబ్ లో ప్రణిత సుభాష్.. బేబీ బంప్ చూపించడం అవసరమా అంటూ ట్రోల్స్!

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రణీత గురించి అందరికీ పరిచయమే.తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.

ఏం పిల్లో.ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో కూడా నటించింది.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement
Pranita Subhash In The Bathtub By Show Baby Bump Trolls On Comment On It , Prani

ఈమె టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి మంచి సక్సెస్ లు అందుకుంది.అంతేకాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనేంటో నిరూపించుకుంది.

గతంలో కోవిడ్ సమయంలో కూడా ఎంతో మంది ప్రజలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది ప్రణీత.ఈమె బాలీవుడ్ లో మంచి సక్సెస్ లో ఉన్న సమయంలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది.దీంతో ఆ సమయంలో తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.

తాను పెళ్లి చేసుకున్న విషయం అప్పుడు బయట పడింది.ఇక ఇప్పటి వరకు ఎటువంటి గాసిప్ లకు కూడా లొంగని ప్రణీత ఆ మధ్య బాగా గాసిప్ లను ఎదుర్కొంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

వెంటనే వాటికి పుల్ స్టాప్ కూడా పెట్టేసింది.

Pranita Subhash In The Bathtub By Show Baby Bump Trolls On Comment On It , Prani
Advertisement

ఇక ప్రణీత సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.అప్పుడప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇటీవలే గర్భం దాల్చిన సంగతి తెలిసిందే.

ఈ విషయం కూడా చాలా రోజుల తర్వాత బయటపడింది.గతంలో తాను కూడా ఈ విషయం గురించి స్పందించింది.తమ జీవితంలో మరో మూడో వ్యక్తి వస్తుంది అని తానే స్వయంగా తెలిపింది.

మొత్తానికి తన గర్భవతి అని తెలియడంతో తన అభిమానులు సంతోషపడ్డారు.ఇక తాజాగా తన ఇన్ స్టాలో ఒక ఫోటో పంచుకుంది.

అందులో తను బాత్ టబ్ లో స్నానం చేస్తున్నట్లు కనిపించింది.ఇక ఆ ఫోటో కొందరి ఫాలోవర్స్ ను ఆకట్టుకోగా లైకులు కూడా కొడుతున్నారు.

మరికొంతమంది ఆ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు.బేబీ బంప్ చూపించడం అవసరమా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ప్రణీత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.మళ్లీ ఈ అమ్మడు టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు