ప్రకాష్ రాజ్ వల్ల కృష్ణవంశీకి తిప్పలు.. రంగమార్తాండ సినిమా ఆలస్యం?

దర్శకుడు కృష్ణవంశీ తాజాగా దర్శకత్వం వహిస్తున్న సినిమా రంగ మార్తాండ.మరాఠీ సినిమా నట సామ్రాట్ కు ఇది రీమేగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాలో నానాపటేకర్ ముఖ్యపాత్రను పోషించగా అదే పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు.మిగిలిన పాత్రల్లో రమ్యకృష్ణ , రాహుల్ సిప్లిగంజ్, వంశీ చాగంటి, అనసూయ భరద్వాజ్,శివాత్మికా రాజశేఖర్, అలీ రెజా లు నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా డబ్బింగ్ మాత్రమే మిగిలిపోయింది.నటుడు ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పకపోవడం వల్లే ఈ సినిమా ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

అంతే కాకుండా ప్రకాష్ రాజ్ ఈ సినిమాకు గాను చాలా డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.అప్పుడు కృష్ణవంశీ తన డబ్బులు పంపించి మిగిలిన సగం డబ్బింగ్ చెప్పిన తర్వాత ఇస్తాను అన్ని చెప్పినట్లు ఒక వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

Advertisement

కానీ ప్రకాష్ రాజు మొత్తం డబ్బులు ఒకేసారి ఇస్తేనే డబ్బింగ్ చెబుతానని లేదంటే లేదు అని అనడంతో ఆ విషయం కాస్త ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది.సినిమాలో ప్రకాష్ రాజ్ లీడ్ యాక్టర్ గా నటిస్తున్నారు.

కాగా ప్రకాష్ రాజ్ మీద ఇలా విమర్శలు చాలా వున్నా, ఎవరూ బయటకి చెప్పడం లేదు.ఎందుకంటే అతనికి సిని పరిశ్రమలో ఉండే గొప్ప గొప్ప వ్యక్తులు అండదండలు ఉన్నాయట.ఇకపోతే ప్రకాష్ రాజ్ కెరిర్ విషయానికి వస్తే.

తెలుగులో ఎన్నో మంచి సినిమా లలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.మరి ముఖ్యంగా ఎక్కువగా ప్రతి నాయకుడి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.

అలాగే కొన్ని సినిమాలలో కామెడీ గా చేస్తూ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు