Mahesh Babu Prakash Raj: మహేష్ బాబు సినిమాలో ఆ నటుడు ఉంటే హిట్టు కొట్టడం పక్కా! గత సినిమాలు ఏం చెబుతున్నాయి !

మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహేష్ బాబు( Mahesh Babu ) సినిమాలో ప్రకాష్ రాజ్( Prakash Raj ) నటిస్తున్నాడు అంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అంతా అనుకుంటారు.

ఒకటి రెండు సార్లు ఈ విషయంలో పొరపాటు జరిగిన వీలైనంత ఎక్కువ సినిమాల్లో ఈ హిట్ ఫార్ములా రిపీట్ అయింది.అందువల్లే మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే చాలు అందులో ప్రకాష్ రాజ్ ఉన్నాడా లేదా అని ఆరా తీస్తూ ఉంటారు ఆయన అభిమానులు.

మొట్టమొదట రాజ కుమారుడు( Raja Kumarudu ) అనే సినిమాతో మహేష్ బాబు టాలీవుడ్ హీరోగా పరిచయం కాగా ఇందులో ప్రకాష్ రాజ్ ఒక ఫుల్ లెన్త్ రోల్ లో మంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించాడు.ఆ తర్వాత వంశీ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.

ముచ్చటగా మూడోసారి వచ్చిన యువరాజు సినిమా( Yuvaraju ) కూడా యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది.అందుకు గల కారణం ప్రకాష్ రాజ్ సదరు సినిమాల్లో నటించకపోవడమే.

Advertisement

ప్రకాష్ రాజ్, మహేష్ బాబు కలిసి నటించిన మురారి సినిమా( Murari ) చాలా పెద్ద హిట్ అయింది.  ఇందులో కథను మలుపు తిప్పే ఒక చిన్న పాత్రలో ప్రకాష్ రాజ్ ఉంటాడు.ఆ తర్వాత నిజం సినిమాలో( Nijam Movie ) కూడా వీరు కలిసి నటించగా ఇది కాస్త యావరేజ్ అనే పేరు తెచ్చుకుంది కానీ మహేష్ బాబుకు మాత్రం నటనకు మంచి పేరు లభించింది.

ఇక ఒక్కడు( Okkadu ) బ్లాక్ బాస్టర్ అయింది ఇందులో ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా నటించాడు.

స్పైడర్, బ్రహ్మోత్సవం, నాని, అతిధి, 1 నేనొక్కడినే, ఆగడు వంటి చిత్రాలు ప్రకాష్ రాజ్ నటించలేదు.అందుకే ఈ చిత్రాలన్నీ పరాజయం పాలయ్యాయి.పోకిరి,( Pokiri ) దూకుడు ( Dookudu ) వంటి చిత్రాలు ఇండస్ట్రీ హిట్ చిత్రాలుగా నిలిచాయి.

ఈ రెండు సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్, మహేష్ బాబు కలిసి నటించారు.బిజినెస్ మ్యాన్ కూడా మంచి హిట్ అందుకుంది.అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది.

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

ఇక భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా ప్రకాష్ రాజ్ కారణంగానే హిట్ అయ్యాయి అనే టాక్ ఉంది.సైనికుడు, ఖలేజా, బాబి, అర్జున్ వంటి చిత్రాలు మంచి సినిమాలే.కానీ అప్పట్లో అవి బాగా ఆడలేదు.

Advertisement

ఆ తర్వాత క్లాసిక్ చిత్రాలుగా పేరు అందుకున్నాయి.ప్రకాష్ రాజ్, మహేష్ బాబు కలిసి నటించకపోయిన బ్రహ్మాండమైన హిట్ సంపాదించిన ఏకైక చిత్రం శ్రీమంతుడు.

తాజా వార్తలు