సౌత్‌ లో ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవం ప్రభాస్ కే.. ఇదే సాక్ష్యం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మరియు సాహో సినిమాల తో బాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదాను దక్కించుకున్నాడు.

ప్రభాస్ కి అక్కడి ప్రేక్షకులు అద్భుతమైన స్టార్ డమ్ ను కట్టబెట్టారు.

అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నాయి.ఆ స్థాయి లోనే సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.

రాధేశ్యామ్‌ సినిమా అందుకు ఉదాహరణ అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్‌ సినిమా విడుదల తేదీ ఇప్పటికే కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే.

మార్చి లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న రాధేశ్యామ్‌ సినిమా సరికొత్త రికార్డును నమోదు చేయబోతున్నట్లుగా ఇండియన్ సినీ వర్గాల వారు చెబుతున్నారు.ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా ఈ రికార్డు దక్కలేదట.

Advertisement

కేవలం ప్రభాస్ క్రేజ్ వల్ల ఈ అరుదైన రికార్డు దక్కబోతోంది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది వేల స్క్రీన్స్ లో ఈ సినిమా స్క్రీనింగ్ అవ్వడానికి సిద్ధమైంది.

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.బాలీవుడ్లో ఏకంగా నాలుగు వేల థియేటర్ల లో విడుదల చేయబోతున్నట్లు గా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు ఏ సౌత్ హీరో కి కూడా ఇలాంటి అవకాశం రాలేదు.బాలీవుడ్ లో ప్రభాస్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అని ఈ నాలుగు వేల నెంబర్ చెప్పకనే చెబుతుంది అంటూ ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాధేశ్యామ్‌ సినిమా మినిమం గా 500 కోట్లను వసూలు చేయడం ఖాయం అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఇప్పుడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అమౌంట్ అంటే 500కోట్లు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.ప్రభాస్ రేంజ్ ఏంటి అనేది ఈ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

ముందు ముందు ఆయన నటించిన సినిమాలు పెద్ద ఎత్తున విడుదల కాబోతున్నాయి.ఆ సినిమాల రేంజ్ ను చూస్తే బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స్ మరియు స్టార్ హీరో లు కూడా షాక్‌ అవ్వాల్సిందే.

Advertisement

తాజా వార్తలు