ఇటలీ నుండి డైరెక్ట్‌గా ముంబయి వెళ్లిన ప్రభాస్‌

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ వచ్చే నెలలో పూర్తి అయ్యే అవకాశం ఉంది.

జనవరి నుండి ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ లో ప్రభాస్‌ పాల్గొనే అవకాశం ఉంది అంటున్నారు.ఈనెల 5వ తారీకు వరకు ఇటలీ షెడ్యూల్ను చేసుకుని వచ్చిన ప్రభాస్‌ నేడు ముంబయికి ఆదిపురుష్‌ సినిమా విషయమై వెళ్లడం జరిగింది.

Prabhas Joins In Adipurush Test Shooing -ఇటలీ నుండి డైర�

రెండు రోజుల పాటు అక్కడ ప్రభాస్‌ పై స్క్రీన్‌ టెస్ట్‌ నిర్వహించడంతో పాటు కాస్ట్యూమ్స్‌ రెడీ కోసం మెజర్మెంట్స్‌ ను కూడా తీసుకోబోతున్నారు.మొత్తానికి ముంబయిలో రెండు రోజుల పాటు ఆదిపురుష్‌ విషయమై ప్రభాస్‌ అక్కడే ఉండబోతున్నాడు.

ఇప్పటికే ప్రభాస్‌ రాధేశ్యామ్‌ కోసం స్టైలిష్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు.ఆది పురుష్‌ లో ప్రభాస్‌ లుక్‌ విషయమై ఇప్పటికే స్కెచ్‌ లు రెడీ అయ్యాయి.

Advertisement

వాటికి సంబంధించిన మేకప్‌ టెస్ట్‌ మరియు ఇతర విషయాలను చర్చించేందుకు గాను ప్రభాస్‌ ముంబయి వెళ్లాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ముంబయిలోని టీ సిరీస్‌ ఆఫీస్ లో ఈ చర్చలు మరియు టెస్ట్‌ షూట్‌ జరుపబోతున్నారు.

రెండు రోజుల పాటు ముంబయిలో ఉండబోతున్న ప్రభాస్ ఆ తర్వాత హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతున్నాడు.సోమవారం లేదా మంగళ వారం నాడు రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు.

రాధేశ్యామ్‌ షూటింగ్‌ కోసం దర్శకుడు రాధాకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని ఒక సెట్‌ నిర్మాణం చేయిస్తున్నాడు.అందుకు సంబంధించిన పనులు దగ్గర ఉండి చేయిస్తున్నాడు.

షూటింగ్‌ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.రాధేశ్యామ్‌ ను నెల రోజుల్లో పూర్తి చేయించాలని భావిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్‌ ఎక్కువ డేట్లు ఇస్తున్నాడు.జనవరి నెలలో ఆది పురుష్‌ సినిమాను మొదలు పెట్టబోతున్నారు.

Advertisement

కేవలం నాలుగు లేదా అయిదు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు.ఎక్కువ గ్రాఫిక్స్‌ వర్క్‌ ఉంటుంది కనుక సినిమాను 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు