హైదరాబాద్ లో ఒకేసారి రెండు సినిమాలు మొదలు పెట్టబోతున్న డార్లింగ్!

ప్రభాస్ బాహుబలి చిత్రంతో తన స్టామినాను ఒక్కసారిగా పెంచుకున్నాడు.అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి.సెట్స్ మీద ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాతో పాటు మరొక రెండు సినిమాల షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

దీంతో పాటు సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.అయితే గత కొద్దీ రోజులుగా అన్ని సినిమాలను ఆపేసారు.

Advertisement
Prabhas Is Going To Start Two Movies Simultaneously In Hyderabad, Prabhas, Hyder

కరోనా ఎక్కువవుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ నిలిపి వేశారు.అయితే తాజాగా ప్రభాస్ ఒక అడుగు ముందుకు వేసి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

సలార్, ఆది పురుష్ సినిమాలను ఒకేసారి హైదరాబాద్ లో మొదలు పెట్టబోతున్నట్టు టాక్.అందులో ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాతో పాటు సలార్ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది.కరోనా సమయంలో కూడా వెనకడుగు వేయకుండా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

చూడాలి మరి ఈ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో.

Prabhas Is Going To Start Two Movies Simultaneously In Hyderabad, Prabhas, Hyder
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్ లో రికార్డ్.. సౌందర్య నటించిన ఈ సినిమా గురించి తెలుసా?

ఇది ఇలా ఉండగా సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

Advertisement

ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.

తాజా వార్తలు