ఆదిపురుష్‌ కొత్త పోస్టర్ అదిరింది.. ఫ్యాన్స్ కు సూపర్ పండగ కానుక

ప్రభాస్( Prabhas) అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూసిన ఆదిపురుష్‌( Adipurush) శ్రీరామ నవమి యొక్క పోస్టర్‌ విడుదల అయ్యింది.

అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు సర్‌ ప్రైజ్ అయ్యే విధంగా అయితే పోస్టర్ లేదు కానీ రామ నవమికి తగ్గట్లుగా పోస్టర్‌ ఉంది అంటూ అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో కొందరు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా గురించి గతంలో విమర్శలు చేశారు.వారికి సమాధానం అన్నట్లుగా పోస్టర్‌ తో ఆదిపురుష్ టీమ్ సర్‌ ప్రైజ్ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా నవమి వేడుకలు జరుగుతున్న ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ విడుదల చేసిన ఆదిపురుష్‌ పోస్టర్( Adipurush poster ) ఆకట్టుకుంది.

ఇక సినిమా విడుదల తేదీ విషయంలో మరోసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది.జూన్ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా తాజా పోస్టర్ తో క్లారిటీ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త చెప్పడం జరిగింది.ప్రభాస్ తో పాటు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు దాదాపు నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా తిరిగి సినిమాను ప్రమోట్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

Advertisement

పోస్టర్ తో జూన్‌ 16న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.నిన్న మొన్నటి వరకు సినిమాను ఈ ఏడాది లో విడుదల చేస్తారా లేదా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

కానీ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ తో క్లారిటీ వచ్చింది.ఆదిపురుష్ సినిమా విడుదల తేదీ వచ్చే వరకు కూడా విడుదల విషయంలో అనుమానమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

టీజర్ విడుదల తర్వాత వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టే విధంగా సినిమా గ్రాఫిక్స్ వర్క్ మళ్లీ జరిగినట్లుగా తెలుస్తోంది.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు