ప్రభాస్ 'ఆదిపురుష్' మ్యూజిక్ డైరెక్టర్ వారేనట !

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి.బాహుబలి చిత్రంతో తన మార్కెట్ అమాంతం పెరిగింది.

అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.రాధే శ్యామ్ సినిమా దాదాపు చివరి దశలో ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.ఈ సినిమా జులై 30 న విడుదల అవుతుంది అని ప్రకటించిన కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

Advertisement
Prabhas Adipurush Movie Music Director, Prabhas, Adipurush, Music Director, Sach

ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Prabhas Adipurush Movie Music Director, Prabhas, Adipurush, Music Director, Sach

ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.దాదాపు 60 రోజులపాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.

Prabhas Adipurush Movie Music Director, Prabhas, Adipurush, Music Director, Sach
చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంగీతం ఎవరు చేయబోతున్నారనే విషయంపై చర్చ జరుగుతుంది.బాలీవుడ్ సంగీత ద్వయం సాచేత్ తండన్, పరంపరా ఠాకూర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.కానీ ఇంకా ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.

Advertisement

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

తాజా వార్తలు