కంటి చూపు రోజురోజుకు మందగిస్తుందా.. అయితే వెంటనే దీన్ని డైట్ లో చేర్చుకోండి!

ఇటీవల రోజుల్లో మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

పాలు తాగే పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది.

గంటలు గంటలు ఫోన్ లోనే గడిపేస్తున్నారు.అయితే ఫోన్ ను అధికంగా వినియోగించడం వల్ల మొట్టమొదటి ఎఫెక్ట్ అయ్యేది కళ్ళే.

అలాగే ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి తదితర అంశాలు కంటి చూపును ప్రభావితం చేస్తున్నాయి.ఈ క్రమంలోనే కంటి చూపు( Eye sight ) తగ్గడం ప్రారంభం అవుతుంది.

మీకు కూడా చూపు రోజు రోజుకు తగ్గుతున్నట్లు అనిపిస్తుందా.అయితే అస్సలు లేట్ చేయకుండా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

Advertisement

ఈ జ్యూస్ మీ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు బీట్ రూట్( Beet root ) ముక్కలు, ఒక కప్పు దానిమ్మ గింజలు( Pomegranate Seeds ) వేసుకోవాలి.

అలాగే రెండు రెబ్బలు కరివేపాకు,( Curry leaves ) రెండు గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసిన ఉసిరికాయలు మరియు ఒక గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని సేవించాలి.రోజు ఉదయం ఈ జ్యూస్ ను తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ముఖ్యంగా ఈ జ్యూస్ లో మెండుగా ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఈ మరియు జింక్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.

కంటి చూపును రెట్టింపు చేస్తాయి.కంటి సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.కంటి చూపు రోజురోజుకు త‌గ్గుతుందని మీరు భావిస్తుంటే కచ్చితంగా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

అలాగే ఫోన్ వాడకం తగ్గించండి.కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

Advertisement

తద్వారా కళ్లద్దాలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.

తాజా వార్తలు