త్రివిక్రమ్ ను ప్రశ్నించాలంటూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పూనమ్ కౌర్ ( Poonam Kaur )కు నటిగా మంచి గుర్తింపు ఉంది.

తక్కువ సినిమాలే చేసినా ఈ నటి తన నటనతో ప్రశంసలతో పాటు విజయాలను సైతం అందుకున్నారు.

అయితే పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.గతంలో కూడా గురూజీ అంటూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్లు చేయగా ఆ ట్వీట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas ) గురించి గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని కానీ సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మాత్రం ఆ ఫిర్యాదును ఏ మాత్రం పట్టించుకోలేదని పూనమ్ కౌర్ తెలిపారు.నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆమె అన్నారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఈ విషయం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించాలని పూనమ్ కౌర్ వెల్లడించారు.

పూనమ్ కౌర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( Movie Artists Association ) లో ఎందుకు ఫిర్యాదు చేశారనే ప్రశ్న సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.పూనమ్ కౌర్ ఈ వివాదం గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పూనమ్ కౌర్ ను అంతలా బాధ పెట్టిన ఘటన ఏంటనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

పూనమ్ కౌర్ పోస్ట్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పూనమ్ కౌర్ కు త్రివిక్రమ్ ఏదో అన్యాయం చేశారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

పూనమ్ కౌర్ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్టులు ఒకింత సంచలనం సృష్టిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

త్రివిక్రమ్ ఈ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు