డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేశారు.. హీరోయిన్ పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే( Pooja Hegde ) గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజ హెగ్డే.

మహేష్ బాబు,అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్, వరుణ్ తేజ్, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.మొన్నటి వరకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించిన ఈమె ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్ మూవీలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేసింది.

Pooja Hegde Iam Victim Targeted Trolling, Pooja Hegde, Tollywood, Comments, Trol

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఈ సందర్భంగా పూజ హెగ్డే మాట్లాడుతూ.పీఆర్‌ స్ట్రాటజీలతో నాపై ట్రోలింగ్‌ చేయించారు.

Advertisement
Pooja Hegde Iam Victim Targeted Trolling, Pooja Hegde, Tollywood, Comments, Trol

అది నన్నెంతగానో షాక్‌ కు గురి చేసింది.మీమ్‌ పేజెస్‌ ( Meme Pages )వరుసగా నన్ను తిడుతూ పోస్టులు పెడుతున్నాయి.

అరె ఇదేంటి? నా గురించి కంటిన్యూగా తిడుతూనే ఉన్నారేంటి అనుకున్నాను.అయితే కావాలనే టార్గెట్‌ చేశారని తర్వాత తెలిసింది.

నన్ను కిందకు లాగడానికి కొందరు ఈ రకంగా డబ్బు ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నాను.అప్పుడు నేను నా తల్లిదండ్రులు చాలా బాధపడ్డాము.

ఇంత దిగజారతారా? అని షాక్ అయ్యాను.నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ట్రోలింగ్‌ చేయించారు.

Pooja Hegde Iam Victim Targeted Trolling, Pooja Hegde, Tollywood, Comments, Trol
సింహగడ్ కోటలో న్యూజిలాండ్ టూరిస్ట్‌కు చేదు అనుభవం.. బూతులు తిట్టించిన యువకులు?
హరీష్ శంకర్ ను పక్కన పెట్టేసిన రామ్ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడా..?

నన్ను కిందకు లాగాలని చూస్తున్నారంటే వారికంటే ఒక మెట్టు పైనున్నట్లే కదా! నా పేరెంట్స్‌కు ఆందోళన పడొద్దని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాను.మరోవైపు ట్రోలింగ్‌ తారాస్థాయికి చేరింది.నన్ను ట్రోల్‌ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టారు.

Advertisement

అసలు వారి బాధేంటో కనుక్కోమని నా టీమ్‌ కు చెప్పాను.వాళ్లు మీమ్‌ పేజెస్‌ ను సంప్రదించగా నన్ను తిట్టేందుకు ఫలానా మొత్తం ఇస్తున్నారని చెప్పారు.

ట్రోలింగ్‌ ను ఆపేయాలన్నా.అవతలివారిని తిట్టాలన్నా మీరు కూడా ఇంత మొత్తం ఇస్తే సరిపోతుందని ఆఫర్‌ ఇచ్చారు.

నాకది మరీ వింతగా అనిపించింది.ఇలాంటి పీఆర్‌ స్టంట్లు నాకు నచ్చవు.

కొన్నిసార్లు భయంకరమైన కామెంట్లు పెడుతుంటారు.చెడుగా కామెంట్‌ చేసిన వ్యక్తి ప్రొఫైల్‌ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు.

కనీసం ఒక ఫోటో, పోస్ట్‌ లాంటివేవీ ఉండదు.కేవలం ఎవరో ఆశ చూపించిన డబ్బుకోసం కక్కుర్తి పడి ఇలా తిడుతున్నారని ఇట్టే అర్థమైపోతుంది అని చెప్పుకొచ్చింది పూజా.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆమెకు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు