పేకాట స్థావరాలపై పోలిసుల మెరుపు దాడి

నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ క్షేత్రాల్లో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై శనివారం టాస్క్ ఫోర్స్,పోలీసులు, చిట్యాల సీఐ శివరాంరెడ్డి బృందంతో కలిసి పక్కా సమాచారం మేరకు మూకుమ్మడిగా మెరుపు దాడి చేశారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ శివరాంరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా చిట్యాల శివారులో కొనతం సత్తిరెడ్డి వ్యవసాయ బావి వద్ద తోట పరిసరాల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేసి యధేచ్ఛగా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతోనే స్థావరాలపై దాడులు చేశామన్నారు.

ఈ దాడిలో 12 మంది పేకాట రాయుళ్ళ అదుపులోకి తీసుకోగా ఒక్కరు పరారయ్యారని అన్నారు.వీరి వద్ద నుండి‌ 3 కార్లు,2 బైకులు,12 సెల్ ఫోన్లు,3 లక్షల 37 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

గుంటి కిరణ్, పగిళ్ళ రమేష్ లు పేకాటకు స్థావరాలను ఏర్పాటు చేసి ఈ పేకాట రాయుళ్ళకి అన్ని వసతులు సమకూర్చి వారి దగ్గర కమిషన్లు తీసుకుంటూ ప్రోత్సహిస్టున్నట్లు తెలిసిందన్నారు.పరారైన వ్యక్తి కోసం ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశామని, త్వరలోనే అతనిని కూడా పట్టుకొని రిమాండ్ కి పంపుతామని,మిగతా 12 మందిని నల్గొండ కోర్టులో హాజరుపర్చి రిమాండ్ తరలిస్తున్నామని తెలిపారు.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు