నల్గొండ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం విధించిన ట్రాఫిక్ జరిమానాలపై ఇచ్చిన డిస్కౌంట్ చెల్లింపులకు ఇక రెండు రోజుల గడువు మాత్రమే ఉందని,ప్రజలందరూ తమ యొక్క వాహనాలపై ఉన్న ఛలాన్స్ క్లియర్ చేసుకోగలరని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఐపీఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా వాహన ఛలానా వివరాలను వెల్లడించారు.

టూ వీలర్/త్రీ వీలర్ వెహికల్స్ పై ఉన్న చలానాపై 75% డిస్కౌంట్, ఫోర్ వీలర్,హెవీ వెహికల్స్ కి 50% డిస్కౌంట్, ఆర్టిసి బస్సులకు 70 శాతం డిస్కౌంట్, కరోనా సమయంలో మాస్కు పెట్టుకోని కారణంగా వేసిన కేసులలో 90% డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందన్నారు.వాహనదారులు తమ వెహికల్స్ పై ఉన్న ఛలానాలను చెక్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సూచించారు.

Police Appeal To Nalgonda People-నల్గొండ ప్రజలకు ప

ఈ యొక్క అవకాశాన్ని మీ యొక్క నెట్ బ్యాంకింగ్ లేదా పేటియం ద్వారా కానీ,మరియు మీ దగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించి కానీ,మీ వెహికల్ పై ఉన్న ఫైన్ లను చెల్లించగలరని కోరారు.

హెల్మెట్ లేదని ఫైన్ వేసిన పోలీసులు.. ఫ్యూజులు ఎగిరిపోయేలా తిరిగి షాకిచ్చిన లైన్‌మెన్..?
Advertisement

తాజా వార్తలు