అక్రమ వడ్డీ ఫైనాన్స్ వ్యాపారస్తులపై కొరడా జులిపించిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Rajanna Sircilla SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పరిధిలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అక్రమ ఫైనాన్సు,వడ్డీ వ్యాపారం చేస్తున్నవారి ఇళ్లపై జిల్లా పోలీసులు 14 టీమ్ లుగా ఏర్పడి ఏక కాలంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది.

తనిఖీల్లో నగదు సుమారు 13,95,120/- రూపాయలు నగదు, 4,19,09,250/-రూపాయల విలువ గలా 113 చెక్స్,71 బాధితులు సంతకం చేసిన ఎంప్టీ చెక్స్,,ఒక చేక్ బుక్,ప్రాంసరి నోట్స్ -(14),ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ (06),(03)మనీ కౌంటింగ్ మిషన్స్,(01)ఎంప్టీ రిజిస్టర్ ,(02)బ్యాంకు పాస్ బుక్స్ ,వన్ చిట్ ఫండ్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ బుక్ ,(01)నోట్ బుక్స్ కంటైనింగ్ చిట్ బిజినెస్ నేమ్ అండ్ స్మాల్ బుక్స్ పర్టైనింగ్ టూ చిట్స్ స్వాధీనపరుచుకున్నారు.

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఇళ్లలో తనిఖీలు నిర్వహించి నలుగురి మీద కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.పబ్బా నాగరాజు,2,80,14,250/-రూపాయల విలువ గలా 67 బ్యాంక్ చెక్స్,10 బాధితులు సంతకం చేసిన ఎంప్టీ చెక్స్,, 4,00,000/- నగదు,బూట్ల నవీన్ కుమార్,03 ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్,మచ్చ కొండయ్య,1,31,50,000/- రూపాయలు విలువ గలా 42 బ్యాంక్,02 బాధితులు సంతకం చేసిన ఎంప్టీ చెక్స్,01 ప్రంసారి నోట్ స్వాధీనం,పాలకొండ శివప్రసాద్,7,45,0000-/ రూపాయల విలువగల 04 బ్యాంక్ చెక్స్,41 బాధితులు సంతకం చేసిన ఎంప్టీ చెక్స్, ప్రంసారి నోట్స్,03 ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

అలాగే వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించి ఒకరి మీద కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు.దుసా దశరథం,(05) ప్రామిసరీ నోట్స్ ,18 బ్యాంకు చెక్స్,(03)మనీ కౌంటింగ్ మిషన్స్,(01)ఎంప్టీ రిజిస్టర్ ,(02)బ్యాంకు పాస్ బుక్స్ ,వన్ చిట్ ఫండ్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ బుక్ ,(01)నోట్ బుక్స్ కంటైనింగ్ చిట్ బిజినెస్ నేమ్ అండ్ స్మాల్ బుక్స్ పర్టైనింగ్ టూ చిట్స్ .నెట్ క్యాష్ 9,95,120/- రూపాయలు స్వాధీన పరుచుకొన్నట్లు తెలిపారు.వంగారి లక్ష్మణ్ సిరిసిల్ల ,గట్టు నారాయణ సిరిసిల్ల, కసానిగొట్టు శ్రీనివాస్ సిరిసిల్ల, అనుగుల ప్రభాకర్,పెద్ద బాలరాజు వేములవాడ,కటకం కిషన్, వేములవాడ, కొమురవేల్లి శేఖర్, వేములవాడ,ముద్రకోలా వెంకటేశం, వేములవాడ కటకం శ్రీనివాస్ ,వేములవాడ లను బైండోవర్ చేయడం జరిగిందన్నారు.

అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

Advertisement

ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు( Money Lenders ) ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అన్నారు.ప్రజలు తమకున్న ఉన్న అత్యవసర పరిస్థితి,తాత్కాలిక అవసరాల కోసం అధిక మొతంలో అవసరంకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆతరువాత అప్పులు ,అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దు అని ఎస్పీ కోరారు.

ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని, అలాగే స్థానిక పోలీసు వారికి ,డయల్100 కు పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు .సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు.అప్పు తీసుకోవడం,ఇవ్వడం నేరం కాదు కానీ ఆర్.బి.ఐ నియమ నిబందనలు,తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు.కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ఈ తనిఖీ లో సి.ఐ మొగిలి, ఉపేందర్, కృష్ణకుమార్, కరుణాకర్, వెంకటేష్, ఎస్.ఐ లు మారుతి, కిరణ్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి, బాలకృష్ణ, వెంకట్రాజం,లక్ష్మారెడ్డి ప్రేమ్ దీప్,నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరుపురాని మహమనిషి ఎన్టీఆర్ - మోతె రాజిరెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News