పీఎం ఈ-బస్ సేవా స్కీం... త్వరలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు!

కేంద్ర ప్రభుత్వం( Central Govt ) దేశాన్ని అన్ని రంగంలో కూడా ముందుకు తీసుకెళ్లడానికి సాయశక్తులా శ్రమ చేస్తోంది.

మరీ ముఖ్యంగా దేశంలో కాలుష్య రహిత వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆటో మొబైల్ కంపెనీలకు బోలెడన్ని సబ్సిడీలు అందిస్తున్న సంగతి విదితమే.ఇక కరోనా తరువాత పెరిగిన ఆయిల్ ధరల నేపథ్యంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, టూ వీలర్స్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకానికి ఆమోదం తెలిపింది.

అవును, ప్రధానమంత్రి ఈ-బస్ సర్వీస్ పథకం( PM-eBus Sewa Scheme ) కింద పట్టణ రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతంగా తయారవుతోంది.ఈ క్రమంలోనే త్వరలో దేశంలోని ప్రధాన నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకు రానున్నాయి.దీనిపై విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడడం జరిగింది.పీఎం ఈ-బస్ సర్వీస్ స్కీమ్‌కు ఆమోదం లభించిందని, ఈ ప్రాజెక్టుకు రూ.57,613 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు.3 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు మరియు సరైన రవాణా సౌకర్యాలు లేని పట్టణాల్లో ఈ పథకం ప్రాధాన్యత ప్రకారం కేంద్రం ఈ పథకం అమలు చేస్తుంది.

Advertisement

అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కూడా ఈ పథకంలో చేర్చనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పుకు రావడం గమనార్హం.ఈ ఎలక్ట్రిక్ బస్సులు పబ్లిక్ ప్రైవేట్ (PPP) భాగస్వామ్యంలో నడుస్తున్నాయని వెల్లడించారు.రాబోయే పదేళ్లపాటు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.

దీని ద్వారా దాదాపు 45,000 నుంచి 55,000 వరకు కొత్త ఉద్యోగాలు వస్తాయని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2 విభాగాలుగా అమలు చేయనుంది.అవి, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ మరియు గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్స్.

పట్టణ రవాణా సేవ కింద ఎలక్ట్రిక్ బస్సులు PPP మోడల్‌లో సర్వీసులు అందిస్తాయి.ఇంకా ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది.

ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..
Advertisement

తాజా వార్తలు