ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలి:జూలకంటి

సూర్యాపేట జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బరితెగించి హద్దు అదుపు లేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు.

రోజురోజుకు పాలకులు అనుసరిస్తున్న విధానాలు చూసిన తరువాత ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని అన్నారు.దేశంలో నిరుద్యోగం,ఆకలి పోటీపడి పెరుగుతూ ఉన్నాయని,కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలను పెంచడం మూలంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయిన్నారు.

రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు.పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఇంటి నిర్మాణం చేపట్టలేదన్నారు.

నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్,ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

పేద,మధ్య తరగతి ప్రజలకు విద్య,వైద్యం అందుబాటులో ఉంచడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంపదను స్వదేశీ,విదేశీ గుత్తా పెట్టుబడిదారి సంస్థలకు దారాదత్తం చేస్తున్నాయని మండిపడ్డారు.

పేద,మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్ శక్తులకు మాత్రం ఆదాయపు పన్ను నుండి మినహాయింపు 7 శాతం ఇచ్చిందని గుర్తు చేశారు.మతోన్మాద,విచ్ఛిన్నకర విధానాలకు పాల్పడుతున్న బిజెపికి రానున్న కాలంలో దేశ ప్రజానీకం బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ విలువలకు నష్టం కలిగించే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు.

రాజ్యాంగ రక్షణకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్26, గురువారం 2024

అనంతరం సిపిఎం సీనియర్ నాయకులు పచ్చిమట్టల పెంటయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,ధీరావత్ రవి నాయక్,బుర్రి శ్రీరాములు,మట్టిపెళ్లి సైదులు,ఎలుగూరి గోవింద్, కోట గోపి,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,పారేపల్లి శేఖర్ రావు,కొదమగుండ్ల నగేష్,షేక్ యాకూబ్,దేవరం వెంకట్ రెడ్డి,కందాల శంకర్ రెడ్డి,పులుసు సత్యం, మద్దెల జ్యోతి,కొప్పుల రజిత,ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి,వేల్పుల వెంకన్న,చెరుకు యాకలక్ష్మి, మేకనబోయిన సైదమ్మ,పల్లె వెంకటరెడ్డి,మేకనబోయిన శేఖర్,దుగ్గి బ్రహ్మం,వట్టెపు సైదులు,మిట్టగడుపుల ముత్యాలు,బెల్లంకొండ సత్యనారాయణ,చిన్నపంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News