ప్రజల్లో టీడీపీ కూటమిపై కసి పెరిగింది..: మంత్రి పెద్దిరెడ్డి

వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.జూన్ 4వ తేదీ తరువాత ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు ఎన్ని రాళ్ల దాడులు చేసినా హత్యాయత్నాలు చేసినా.సీఎం జగన్( CM Jagan ) మొక్కవోని దీక్షతో బస్సు యాత్ర చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.రాళ్ల దాడి అనంతరం ప్రజల్లో టీడీపీ( TDP ) కూటమిపై కసి పెరిగిందని పేర్కొన్నారు.

బస్సు యాత్రకు రెట్టింపు సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారని వెల్లడించారు.సీఎం జగన్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

అయితే ప్రస్తుతం సీఎం జగన్ ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra )ను చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు