లోక్సభ ఎన్నికల సమయంలో నటుడు భాజపా ఎంపీ అయిన రవి కిషన్( Ravi Kishan ) చిక్కుల్లో పడ్డాడు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయనకు షాకిస్తూ ఒక ఆమె నేను ఆయన భార్యను అంటూ మీడియా ముందుకు రావడంతో పాటు తన కూతుర్ని కూడా ఆయన స్వీకరించాలి అంటూ సంచులను వాఖ్యలు చేసింది.
ప్రస్తుతం ఇదే విషయం సినిమా ఇండస్ట్రీలో అలాగే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ప్రీతి కిషన్( Preeti Kishan ) అనే మహిళని పెళ్లి చేసుకున్న రవికిషన్ కి రివా కిషన్ అనే కూతురు ఉంది.
కాగా భోజ్ పురి, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్ అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమాతో( Race Gurram Movie ) తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించాడు.2019లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పుర్ నుంచి ఎంపీగా గెలిచాడు.త్వరలో మరోసారి పోటీ చేయబోతున్నాడు.అయితే సరిగ్గా ఇలాంటి సమయంలో అపర్ణా ఠాకుర్( Aparna Thakur ) అనే మహిళతన ఆయన భార్యనే అంటూ మీడియా ముందు కొచ్చింది.1996లోనే తమకు పెళ్లి జరిగిందని, పాప కూడా పుట్టిందని ఆమెని తీసుకొచ్చింది.పాత ఫొటోల్ని కూడా మీడియాకు రిలీజ్ చేసింది.తమతో రవికిషన్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారని, కానీ బహిరంగంగా మాత్రం ఒప్పుకోవడం లేదని ఈమె ఆరోపణలు చేసింది.
దీంతో రవికిషన్ రాజకీయ కెరీర్ చిక్కుల్లో పడేలా కనిపిస్తోంది.
రవికిషన్ నా తండ్రి అన్న విషయం నాకు 15 ఏళ్లు వచ్చిన తర్వాతే తెలిసింది.అంతకు ముందు ఆయన్ని అంకుల్ అని పిలిచేదాన్ని.నా ప్రతి పుట్టినరోజుకి మా ఇంటికి వచ్చేవారు.
ఆయన కుటుంబాన్ని కూడా నేను ఓసారి కలిశాను.తండ్రిగా చూస్తే మాత్రం ఎప్పుడు నా దగ్గర లేరు.
నన్ను కూతురిగా స్వీకరించాలని ఆయన్ని కోరుతున్నాను అందుకే కోర్టులో కేసు వేద్దామని అనుకుంటున్నము అని అపర్ణ ఠాకుర్ కూతురు చెప్పుకొచ్చింది.మరి ఈ విషయంపై రవికిషన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.