ఇమ్యూనిటీ పెంచే పియ‌ర్స్ పండ్లు.. డ‌యాబెటిస్ కూడా ప‌రార్‌!

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా క‌రోనా భ‌య‌మే ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తోంది.

ఈ ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌ను ధైర్యంగా ఎదుర్కోవాలంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు సూచిస్తున్నారు.

అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌ర‌చ‌డంలో పియ‌ర్స్ పండ్లు అద్బుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.ఎంతో టేస్టీగా ఉండే పియ‌ర్స్ పండ్లు.

Pear Fruit Helps To Increase Immunity Power! Pear Fruit, Immunity Power, Latest

మార్కెట్‌లో విరి విరిగా దొరుకుతాయి.ఇక రుచిలోనే కాదు.

బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా ప్రియ‌ర్స్ పండ్ల‌తో పొందొచ్చు.అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పియ‌ర్స్ పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది.కాబ‌ట్టి, పియ‌ర్స్ పండ్ల‌ను ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

అలాగే పియ‌ర్స్ పండ్ల‌లో ఉండే విట‌మిన్ కె ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌కుండా ర‌క్షిస్తుంది.విట‌మిన్ ఈ చ‌ర్మ ఆరోగ్యన్ని మెరుగుప‌రుస్తుంది.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ పండ్ల‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే, కార్బోహైడ్రేట్స్ మ‌రియు క్యాలరీలు త‌క్కువ‌గా.

పీచు ప‌దార్థం మ‌రియు వాట‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉండే పియ‌ర్ పండు తీసుకోవ‌డం వ‌ల్ల ఎక్కువ స‌మ‌యంలో క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది.అదే స‌మ‌యంలో ఈ పండ్లు తిన‌డం వ‌ల్ల యాక్టివ్‌గా కూడా ఉండాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

దాంతో వేరే ఆహారం తీసుకోలేరు.ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

Advertisement

అలాగే డ‌యాబెటిస్ ఉన్న వారు పియ‌ర్ పండు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు ఎప్పుడూ అదుపులో ఉంటాయి.అదేవిధంగా, పియ‌ర్స్ పండ్లు తీసుకోవ‌డం వ‌ల్ల‌.

అందులో ఉండే పోష‌కాలు గుండె సంబంధిత సమ‌స్య‌ల నుంచి కాపాడ‌తాయి.జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న వారు పియ‌ర్స్ పండ్లు తీసుకుంటే చాలా మంచిది.

ఎందుకంటే, ఇందులో ఉండే ఫైబ‌ర్ జీర్ణ శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది.మ‌రియు మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

ఇక ఎముకుల‌ను, దాంతాల‌ను బ‌లంగా మార్చ‌డంలో ఈ పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి.అయితే పియ‌ర్స్ పండ్ల‌ను రోజుకు ఒక లేదా రెండు మాత్ర‌మే తీసుకోవాలి.

అంత‌కు మించి తీసుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

తాజా వార్తలు