Kushi Movie Director SJ Surya : పవన్ తో ఖుషి డైరెక్టర్.. మెమొరబుల్ పిక్ షేర్.. నెట్టింట వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలు చాలానే ఉన్నాయి.అందులో ముందు చెప్పుకోవాల్సిన సినిమా ఖుషి.

పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా శ్రీ సూర్య బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.పవన్, భూమిక కెమిస్ట్రీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టింది.ఇక అంత సెన్సేషనల్ సినిమాను ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది.2001లో రిలీజ్ అయినా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.భూమిక అందాలకు అంతా ఫిదా అయ్యారు.

అలాగే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, స్టైల్, యాక్షన్ అన్ని కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేసాయి.మరి ముఖ్యంగా మణిశర్మ సాంగ్స్ ఇప్పటికి సూపర్ హిట్టే.

ఆ సాంగ్స్ కూడా సినిమా హిట్ అవ్వడానికి ఒక కారణం అనే చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా డైరెక్టర్ ఎస్ జే సూర్య ఖుషి సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక మెమరబుల్ ఫోటోను షేర్ చేసారు.

Advertisement

సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో కాసేపటికే వైరల్ అయ్యింది.పవన్ కుర్చీలో కూర్చుని ఉండగా.

సూర్య ఆయన మెడ చుట్టూ చేతులు వేసి నిలబడి ఉన్నాడు.పవన్ ఎంతో స్టైలిష్ గా కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నాడు.

ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.ప్రెజెంట్ పవన్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించాడు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

అలాగే తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.ఇన్ని చేతిలో ఉన్న పవన్ మాత్రం షూటింగ్ లలో పాల్గొనకుండా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.

Advertisement

అందుకే అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా క్లారిటీ లేదు.

తాజా వార్తలు