మంత్రి రోజాపై సెటైర్లు వేసిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో "యువశక్తి" సభలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.అధికార పార్టీ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ముఖ్యంగా తనని విమర్శించే మంత్రులను ఉద్దేశించి సెటైర్లు వేయడం జరిగింది.దీనిలో భాగంగా మంత్రి రోజాకి పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

డైమండ్ రాణి అంటూ సెటైర్లు వేశారు."డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతుంది.

నువ్వు కూడానా.?, ఛీ నా బతుకు చెడ! మీకోసం డైమండ్ రాణి లతో కూడా తిట్టించుకుంటా.నాకు ఓకే.ఎవరో వస్తారు.మంచి రోజులు తెస్తారని మర్చిపోకండి.

Advertisement

ఎవడు రాడు.మీరే నిలబడాలి.

మీ కోసం నిలబడే వారికి మీరు అండగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర పోరాటాలకు గడ్డ ప్రతి ఒక్కరూ పోరాడాలని పవన్ పిలుపునివ్వడం జరిగింది.

జనసేన అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు.అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

మత్స్యకారులకు జట్టిలు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు