తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణేనా..?

తాజాగా జరిగిన తెలంగాణ(Telangana) ఎన్నికల్లో బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ పొత్తు విషయంలో చాలామంది భయపడ్డారు.

ఎందుకంటే జనసేన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది.ఒకవేళ తెలంగాణలో కనీసం ఒక సీటు కూడా గెలవకపోతే కచ్చితంగా జనసేన (Janasena) పార్టీ క్రేజ్ ఏపీ లో పడిపోతుందని,జనసేనని ఎవరు నమ్మరని అందరూ భావించారు.

ఇక ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుని తెలంగాణలో కూడా పోటీ చేశారు.అయితే జనసేన బిజెపితో పొత్తు పెట్టుకుని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్ దక్కించుకోలేదు.

దీంతో ఘోరమైన ఓటమిపాలైంది.ఇక బిజెపి ఈసారి 8 నియోజకవర్గాల్లో గెలుపొందింది.

Advertisement
Pawan Kalyan Is The Reason Why BJP Did Not Come To Power In Telangana Details, B

అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి బిజెపి కాస్త పుంజుకుందనే చెప్పవచ్చు.ఇదిలా ఉంటే బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకోవడం వల్లే మేము తెలంగాణ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం పాలయ్యం అని, తెలంగాణలో బిజెపి ఓడిపోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అంతేకాదు ఒంటరిగా పోటీ చేసి ఉంటే మరిన్ని స్థానాల్లో బిజెపి గెలుపొందేది.

Pawan Kalyan Is The Reason Why Bjp Did Not Come To Power In Telangana Details, B

బిజెపి (BJP) బలంగా ఉన్న స్థానాల్లో జనసేనకి సీట్లు కేటాయించి తప్పు చేశామని,అక్కడ బిజెపి గనుక పోటీ చేసి ఉంటే కచ్చితంగా బిజెపి గెలిచేదని, అలాగే హైదరాబాద్ పై జనసేన వల్లే బిజెపి పట్టు కోల్పోయింది అంటూ కిషన్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.అయితే ప్రస్తుతం ఈ వార్తలు కిషన్ రెడ్డి వరకు కూడా చేరాయట.అయితే కిషన్ రెడ్డి (Kishan Reddy) ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ అసలు నేను జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో బిజెపి ఓడిపోయింది అని ఎక్కడ కూడా మాట్లాడలేదు.

అలాగే జనసేనతో పొత్తు అనేది కేవలం ఇద్దరు నాయకులు తీసుకున్న నిర్ణయం కాదు.

Pawan Kalyan Is The Reason Why Bjp Did Not Come To Power In Telangana Details, B
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇరు పార్టీలు నిర్ణయించుకొని పొత్తు పెట్టుకున్నాం.అలాగే జనసేన ఎన్డిఏ భాగస్వామ్యపక్షంగా ఉంది కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం.అయితే ఇరు పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తే అధికారంలోకి వస్తామని భావించాం.

Advertisement

కానీ అది జరగలేదు.అయితే తెలంగాణలో అధికారంలోకి రాలేదని జనసేన వల్లే మేము ఓడిపోయామంటూ పవన్ కళ్యాణ్ గురించి అనుచితంగా నేను మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.నేను పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట కూడా అనలేదు.

ప్రజలు ఈ అబద్ధపు ప్రచారాన్ని అస్సలు నమ్మకూడదు.కొంతమంది కావాలనే ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నారు.

ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

తాజా వార్తలు