'ఓజి'లో పవన్ ఇంట్రో సీన్ అదుర్స్.. కెరీర్ లోనే బెస్ట్ సీక్వెన్స్ అట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టి వరుస సినిమాలను పూర్తి చేస్తూ పోతున్నాడు.

మరి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఓజి( OG Movie ) ఒకటి.

టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.ఈ అంచనాలను మరింతగా పెంచేస్తూ మేకర్స్ రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు.

ఇవే కాకుండా ఈ సినిమా నుండి ఒక్కొక్కటిగా ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.ఈ సినిమా నుండి తాజాగా మరో అప్డేట్ బయటకు వచ్చింది.

రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ బయటకు రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు.మరి ఆ వైరల్ అవుతున్న వార్త ఏంటంటే.

Pawan Kalyan Introduction Sequence Loading Details, Director Sujeeth, Og Movie,
Advertisement
Pawan Kalyan Introduction Sequence Loading Details, Director Sujeeth, OG Movie,

ఓజిపై నెక్స్ట్ లెవల్ అంచనాలను పెట్టుకున్న ఈ సినిమాలో పవన్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ గురించి వార్తలు వస్తున్నాయి.సుజీత్ ఈ సినిమాలో పవర్ ఫుల్ ఇంట్రోను ప్లాన్ చేసాడని.

ఇప్పటి వరకు పవన్ కెరీర్ లోనే బెస్ట్ సీక్వెన్స్ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.పంజా, వకీల్ సాబ్ వంటి ఇంట్రో సీన్స్ ను బీట్ చేసేలా సుజీత్ తెరకెక్కిస్తాడో లేదో చూడాలి.

ఇక గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుజీత్ పవన్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు