హరిహర వీరమల్లు కు తప్పని కష్టాలు...ఈ సినిమా చేయడం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తనదైన రీతిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరో గా కూడా ఎదిగాడు.

ఇక ఇప్పుడు ఆయన జనసేన( Janasena ) అనే పార్టీ ని పెట్టి పొలిటికల్ గా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే వచ్చే నెలలో ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆయన సినిమాలకి కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఎలక్షన్స్ పనుల్లో బిజీగా తిరుగుతున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన "హరిహర వీరమల్లు", ఉస్తాద్ భగత్ సింగ్"( Ustaad Bhagat Singh ), "ఓ జి " అనే మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచారు.ఇక ఈ మూడు సినిమాలు కూడా కొంచెం కొంచెంగా షూటింగ్స్ ను కంప్లీట్ చేసుకున్నాయి.ఇక ఓజి( OG ), ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమా( Harihara Veeramallu ) మాత్రం నాలుగు సంవత్సరాల క్రితమే సెట్స్ మీదకి వెళ్ళింది.

అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ సినిమాను రిలీజ్ చేయడం లేదు.అయితే ఒకానొక సమయంలో ఈ సినిమా ఆగిపోయింది అనే పుకార్లు కూడా వచ్చాయి.

Advertisement

కానీ ప్రొడ్యూసర్స్ శ్రీరామనవమి( Srirama Navami ) సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఇక ఈ పోస్టర్ అప్పుడెప్పుడో ఈ సినిమా నుంచి వచ్చిన చిన్న గ్లిమ్స్ తప్ప ఇప్పటివరకు ఒక టీజర్ ని కూడా వదల్లేదు.మరి ఈ సినిమా చేయడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదా.? తను ఎందుకు ఈ సినిమాని డిలే చేస్తూ వస్తున్నాడు అనే విషయాలైతే తెలియాల్సి ఉన్నాయి.ఇక కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా చేయడం అంత పెద్దగా నచ్చట్లేదు.

అందుకే ఒప్పుకున్న దానికోసం ఈ సినిమాని కంప్లీట్ చేసే పనిలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తి చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు