పవన్ కు వచ్చిన క్లారిటీ బాబు కి ఎప్పుడొస్తుందో ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు, టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయిపొయింది.

ఇక కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జనసేన పార్టీ అయితే ఒక్కటంటే ఒక్క సీటుకే పరిమితం అయిపొయింది.

ఈ పరిణామాలు అసలు ఎవరూ ముందుగా ఊహించనేలేదు.టీడీపీ సంగతి కాసేపు పక్కనపెడితే ఎన్నో అంచనాలతో అధికారం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమి పై పెద్ద షాకే తిన్నారు.

కింగ్ మేకర్ అవుతామనుకుంటే సింగల్ సీటుకే పరిమితం అయ్యామనే బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.కానీ అసలు తాము ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామని విషయాన్నీ అయితే తెలుసుకుతీరాలని పవన్ రంగంలోకి దిగారు.

వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలనుంటే అందుబాటులో ఉన్న నాయకులను అడిగితే సరిపోదని, కింది స్థాయి కార్యకర్తల ద్వారా వాస్తవ పరిస్థితులు ఏంటో స్పష్టంగా తెలుసుకోవచ్చని పవన్ భావిస్తున్నారు.

Advertisement

అంతకు ముందు అసలు జనసేన పార్టీ ఎందుకింత ఘోరంగా ఓడిపోయిందో తెలుసుకోవాలనుకున్నారు.వరుసగా మీటింగ్స్ పెట్టారు.కానీ ఆ మీటింగ్స్ ద్వారా ఉపయోగంలేదని కార్యకర్తల ద్వారానే అసలు విషయం బయటకి వస్తుందని పవన్ ఫిక్స్ అయిపోయాడు.

దీనిలో భాగంగానే స్వయంగా పార్టీ కార్యకర్తలను కలవాలని చూస్తున్నాడు.వివిధ నియోజకవర్గాల్లో కీలకంగా పనిచేసిన జనసైనికులతో నేరుగా మాట్లాడి వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని చూస్తున్నాడు.కొన్ని చోట్ల నియోజకవర్గ స్థాయిలో, మరికొన్ని చోట్ల మండలాల స్థాయిలో జనసైనికుల్ని పిలిపించి మాట్లాడాలనుకుంటున్నాడు.

జులై మొదటి వారం నుంచి జరగనున్న ఈ సమావేశాల్లో అసలు విషయం ఏంటో తెలుస్తుందని, ఆ తరువాత పార్టీ పరంగా చేయాల్సిన ప్రక్షాళన చేయాలని పవన్ చూస్తున్నాడు.

సరిగ్గా ఇక్కడే పవన్ ను చంద్రబాబు ను పోల్చి చూస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.అసలు తామెందుకు ఓడామనే విషయాన్ని పవన్ తెలుస్కుంటున్నాడని, కానీ బాబు మాత్రం ఇంకా భ్రమల్లోనే గడుపుతున్నారన్నారు.కొంతమంది ప్రజల్ని తన కార్యాలయానికి రప్పించుకొని వాళ్లతో ఓదార్పులు చేయించుకోవడం, మరోవైపు అందుబాటులో ఉన్న నాయకులతో ఓటమి పై విశ్లేషణ చేస్తున్నారు.

ఇంతకీ జగన్ అసెంబ్లీ లో అడుగుపెడతారా ? 
తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ..!!

దీంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏంటో బాబు కి అర్ధం కావడంలేదు.పవన్ చేస్తున్నట్టుగా క్షేత్ర స్థాయిలో ఏమి జరిగింది ? పార్టీ ఓటమికి గల కారణాలు కార్యకర్తల ద్వారా తెలుసుకుంటే రానున్న రోజుల్లో ఆ తప్పులను సరిదిద్దుకుని బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది.అయితే పవన్ బాటలో బాబు నడుస్తాడా అనేదే పెద్ద సందేహంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు