త్వరలో రాజకీయాల్లో అడుగుపెట్టనున్న స్టార్ హీరో సతీమణి

ప్రముఖ కోలీవుడ్ నటి, స్టార్ నటుడు సూర్య సతీమణి జ్యోతిక గురించి తెలియని వారు ఎవరూ లేరు.

సూర్య సతీమణి కంటే ముందు ఆమె కోలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా ప్రముఖ నటి నగ్మా సోదరి గా కూడా సుపరిచితురాలు.అయితే కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతిక.

అయితే స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తరువాత కొద్ది కాలం సినిమా లకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం మళ్లీ సినిమా ప్రాజెక్ట్ లతో బిజీ గా మారిపోయింది.ఆమె పెళ్లి కాక ముందు నటించిన చంద్రముఖి చిత్రం ఎలాంటి హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

జ్యోతిక కెరీర్ లో ది బెస్ట్ మూవీ గా చెప్పుకోవాలి.ఆ చిత్రంలో జ్యోతిక నటనే ఒక పెద్ద హైలెట్ గా చెప్పుకోవాలి.

Advertisement

అయితే ఇప్పుడు ఇక మరోసారి సినిమా లతో బిజీ అయిన జ్యోతిక త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీటిలో ఎంత నిజం ఉన్నది అన్న విషయం పక్కన పెడితే జ్యోతిక మరో రెండేళ్ల లో తమిళనాట జరగబోయే ఎన్నికల్లో ఒక పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.అయితే అసలు ఏ పార్టీ,ఏ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తుంది అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు కానీ ఆమె పక్కా రాజకీయాల్లోకి రానున్నట్లు కొలువుడ్ న్యూస్ మీడియా లో ఈ వార్త హల్ చల్ చేస్తుంది.అయితే ఈ వివరాలు తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సి ఉంటుంది.

అప్పుడే ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు