విడుదలైన మూడునెలలకు ది వారియర్ చూసిన పరుచూరి.. ఏం చెప్పారంటే?

తెలుగు సినీ ప్రపంచానికి పరుచూరి గోపాలకృష్ణ అనే పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు.దాదాపు తెలుగులో వందలాది సినిమాలకు కథల రూపంలో ప్రాణం పోసాడు.

తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాలకు తనదైన శైలిలో విజయాలు అందుకొన్నాడు.ఇక ఇతడి సోదరుడు పరుచూరి వెంకటేశ్వరరావు గురించి మనందరికీ తెలుసు.

మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పరుచూరి బ్రదర్స్ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ప్రభాస్ హీరోగా ఏవైనా సినిమాలు చూస్తే వెంటనే వాటి గురించి రివ్యూ చెప్పేస్తూ ఉంటాడు.

సినిమాలోని లోపాల గురించి, నటీనటుల నటన గురించి చెబుతూ ఉంటాడు.అయితే తాజాగా రామ్ పోతినేని నటించిన దివారియర్ సినిమా గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు.

Advertisement

ఈ సినిమా విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తుండగా.పరుచూరి ఇప్పుడు ఈ సినిమాను చూసాడు.

ఈ ఏడాది జులై 14న డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఈరోజు విడుదలైన సినిమా ది వారియర్.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.

ఇందులో రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో హీరోయిన్ గా నటించారు.అంతేకాకుండా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు నటించారు.

ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా విడుదలైంది.ఈ సినిమా విడుదల కాకముందే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.కానీ సినిమా విడుదలయ్యాక డిజాస్టర్ టాక్ వచ్చింది.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

అయితే ఈ సినిమాను తాజాగా వీక్షించిన పరుచూరి గోపాలకృష్ణ సినిమా గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు.ఈ సినిమాలో బలాలు, బలహీనతలను దృష్టిలో పెట్టుకొని ఇకపై రచయితలు కథలు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నాడు.

Advertisement

ప్రాణం పోసే డాక్టర్ జీవితం నుంచి ప్రాణం తీసిన పోలీస్ ఆఫీసర్గా వచ్చిన ఈ సినిమా.ఒకప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మానవుడు దానవుడు, సర్పయాగం లాంటి సినిమాల వంటివని అన్నాడు.

ఇక ఆ సమయంలో ఈ రెండు సినిమాలు బాగా హిట్ అందుకున్నాయి అని అన్నాడు.అయితే గతంలో రామ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ పాత్ర ప్రభావం సినిమాలో పాత్ర పై పడిందని అన్నారు.ఎందుకంటే రామ్ అనగానే వెంటనే లవ్ స్టోరీని ప్రేక్షకులు కోరుకుంటారు అని.అలా ఈ సినిమాలో కృతి శెట్టికి, రామ్ కు మధ్య లవ్ సీన్స్ పెట్టడం కూడా బాగా కలిసి వచ్చిందని అన్నాడు.ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టి పాత్ర హైలెట్ గా ఉందని తెలిపాడు.

డైలాగులు కూడా బాగున్నాయి అని తెలిపాడు.ఈ సినిమాలో హీరో పోలీస్ కంప్లైంట్ విత్ డ్రా తీసుకునే సన్నివేశం తీసి ఉంటే మరింత బాగుండేది అని.క్లైమాక్స్ లో కూడా మార్పులు చేరిస్తే మరింత బాగుండేది అని.ఇక దర్శకుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి విజయం వచ్చేది అని అన్నాడు.

తాజా వార్తలు