నా ముక్కు కోసేశాడు.. రక్తం కారిపోతుంది.. ఆ విషయాలు చెప్పిన గోపీచంద్!

టాలీవుడ్ హీరో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్.ఈ సినిమాకు దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 యువి క్రియేషన్స్ పతాకంపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల కావలసి విషయం తెలిసిందే.

దీంతో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరని తెలిపారు గోపీచంద్.ఆయన తనను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారని అది మొదటి సినిమా కావడంతో తాను సరిగా చేస్తానో లేదో అని చాలామంది అనుమానపడ్డారట.

Advertisement
Pakka Commercial Team Gopichand Maruthi Interesting Revelations , Gopichand, Pak

కానీ చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు.ఆరునెలల వరకు ఏ సినిమా రాకపోవడంతో ఆపై కొన్ని పరిస్థితుల వల్ల విలన్‌గా చేశాను.

నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి.ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను అని చెప్పు కొచ్చారు గోపీచద్.

ఇక గోపిచంద్ చిన్నప్పుడు తన అన్న ప్రేమ్‌చంద్‌ బ్లేడు తీసుకుని గోపీచంద్ దగ్గరకు వచ్చి ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడట.

Pakka Commercial Team Gopichand Maruthi Interesting Revelations , Gopichand, Pak

అప్పుడు గోపీచంద్ పెరుగన్నం తింటున్నా రక్తం కారి తన పళ్లెంలో నిండిపోయిందట.అలా హీరో గోపీచంద్ చిన్నతనంలో అంటే దాదాపు తాను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది అంటూ కాస్త ఎమోషనలయ్యాడు గోపీచంద్‌.ఇకపోతే పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్ లు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు