వందే భారత్ మిషన్: ఇప్పటి వరకు స్వదేశానికి 60 లక్షల మంది, కేంద్రం ప్రకటన

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.

పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.

ఎప్పుడూ కలలో కూడా ఊహించని ఎన్నో సంఘటనలు గతేడాది జరిగాయి.అయితే భారత ప్రభుత్వం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక విమానాలు నడిపి లక్షలాది మంది ప్రవాసుల్ని స్వదేశానికి తీసుకొచ్చింది.

‘వందే భారత్ మిషన్’ కింద ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 60 లక్షల మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.ప్రస్తుతం ఈ మిషన్‌కి సంబంధించి ఎనిమిదో దశ కొనసాగుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.2020, మే 6న 64 విమానాలు, 12,800 మంది ప్రయాణికులతో ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమైంది.నాటి నుంచి నేటి వరకు దాదాపు 60 లక్షల మంది ప్రవాసుల్ని స్వదేశానికి తీసుకువచ్చామని కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement
Over 6 Million People Facilitated Under 'Vande Bharat' Mission: Aviation Ministe

అయితే ఓ పక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా, టీకాలు అందుబాటులోకి వస్తున్నా ప్రపంచంపై కోవిడ్ ముప్పు ఇంకా తొలగిపోలేదు.నిత్యం ఏదో ఓ మూలన ఆ మహమ్మారి విజృంభిస్తూనే వుంది.

వీటికి కొత్తగా మ్యూటేషన్ చెందిన వైరస్‌ అదనం.వివిధ దేశాల్లో కొత్తగా వెలుగులోకి వస్తున్న మార్పు చెందిన కరోనా.

ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేస్తోంది.ఇప్పటికే యూకే సహా పలు దేశాల్లో కఠిన లాక్‌డౌన్‌ అమల్లో వున్న సంగతి తెలిసిందే.

మనదేశంలోనూ యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం స్ట్రెయిన్‌లు వెలుగు చూస్తున్నాయి.దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

Over 6 Million People Facilitated Under vande Bharat Mission: Aviation Ministe
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

వివిధ దేశాల నుంచి మనదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం గత బుధవారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.ఈ కొత్త గైడ్‌లైన్స్ ఫిబ్రవరి 22 అర్ధరాత్రి 11.59 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వెలువడేవరకు అమల్లో ఉంటాయి.ప్రధానంగా బ్రిటన్, ఐరోపా, మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ ప్రత్యేక మార్గదర్శకాలను అనుసరించాలి.కొత్త నిబంధనల ప్రకారం పైన వివరించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణం మొదలవడానికి ముందే ఎయిర్‌ సువిధ వెబ్‌సైట్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.కొవిడ్‌-19 ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ ఫలితం నివేదికను అప్‌లోడ్‌ చేయాలి.అంతేకాకుండా భారత్‌కు చేరకున్నాక వీరంతా తమ స్వంత ఖర్చులతో ఎయిర్‌పోర్టులో కరోనా టెస్ట్ చేయాంచుకోవాల్సి ఉంటుంది.

Advertisement

కాగా, కరోనా కారణంగా గతేడాది మార్చి 25 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మరోసారి నిషేధాన్ని పొడిగించింది.

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డీజీసీఏ విధించిన నిషేధం ఫిబ్రవరి 28తో ముగియనుంది.అయితే, దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం పొడిగిస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.

తాజా వార్తలు