The Line Megacity: ఒక భవనంలో ఒక సిటీకి చెందిన ప్రజలంతా నివాసం.. భవిష్యత్తులో సాధ్యపడుతుందా?

ప్రపంచంలో జనాభా నానాటికి పెరుగుతోంది.దీంతో అడవులు క్రమంగా తగ్గుతున్నాయి.

నివాస ప్రాంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

వ్యవసాయం సాగు చేసే భూమి కూడా క్రమంగా తగ్గతూ వస్తోంది.

ఈ తరుణంలో కొన్నేళ్లకు భూమిపై ఆహార సంక్షోభం ఏర్పడుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ తరుణంలో పరిష్కార మార్గాల కోసం తీవ్రంగా అన్వేషణలు కొనసాగుతున్నాయి.

చంద్రుడు వంటి ఉపగ్రహంతో పాటు ఇతర గ్రహాలపై మానవులు నివసించడానికి అనువైన ప్రాంతం ఉందా లేదా అనే విషయంపై వివిధ దేశాలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ఆసక్తికర విషయం బయటికొచ్చింది.

Advertisement

ఏరియల్ ఫోటోగ్రఫీ కంపెనీ ఓట్ స్కై విడుదల చేసిన ఫుటేజీ సౌదీ అరేబియాలో నియోమ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా నిర్మించబడుతున్న ది లైన్ మెగాసిటీపై పనిని చూపుతోంది.ఈ సిటీకి ఉన్న ప్రత్యేకతలు తెలుసుకుందాం.

ఒక నగరంలోని ప్రజలంతా ఒకే బిల్డింగ్‌లో నివసించడం అనేది ఊహకు అందని విషయం.ప్రస్తుతం టెక్నాలజీ చాలా విషయాలను నిజం చేస్తోంది.

అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది.తాజాగా ఓట్ స్కై చిత్రీకరించిన డ్రోన్ ఫుటేజ్ సౌదీ అరేబియా యొక్క వాయువ్య ప్రాంతంలో నిర్మించబడుతున్న లీనియర్ సిటీలో నిర్మాణం జరుగుతున్నట్లు చూపిస్తుంది.సైన్స్ ఫిక్షన్ సినిమాలలో చూపించినట్లు ఓ సరికొత్త భవన నిర్మాణానికి అంతా సిద్ధం అవుతోంది.200మీ వెడల్పు ఉండి, 170 కిలో మీటర్ల మేర పొడవు ఉండి, 500మీ ఎత్తు కలిగి ఉండే ఓ భవనం నిర్మాణం అవుతోంది.విడుదలైన వీడియోలో, అనేక ఎక్స్‌కవేటర్‌లు ఎడారిలో విస్తృత రేఖీయ కందకాన్ని త్రవ్వడం చూడవచ్చు.

కందకంలో, 170 కిలోమీటర్ల పొడవుతో నగరానికి పునాదులు నిర్మించాలని భావిస్తున్నారు.ఈ పనులు నగరం పొడవునా నిర్మించాలని యోచిస్తున్న భూగర్భ రవాణా వ్యవస్థకు సన్నాహాలు కూడా చూపవచ్చు.ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించబడిన ది లైన్‌ను తొమ్మిది మిలియన్ల మంది ప్రజలు ఉండేలా రూపొందించారు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

ఇది 500 మీటర్ల పొడవు, చుట్టూ అద్దాలతో దర్శనమిస్తోంది.దేశంలోని వాయువ్య ప్రాంతంలో 10 ప్రాంతాలు అభివృద్ధి చెందే నియోమ్ ప్రాజెక్ట్‌లో మెగాసిటీ భాగం.

Advertisement

ఇది కార్యరూపం దాల్చితే ఒకే చోట అంతా నివసించే కల సాకారం అవుతుంది.

తాజా వార్తలు