ఒకే ఒక జీవితం, బ్రహ్మాస్త్రం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే.. ఏ ఓటీటీలు అంటే?

ఈరోజు థియేటర్లలో విడుదలైన ఒకే ఒక జీవితం, బ్రహ్మాస్త్రం సినిమాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

బ్రహ్మాస్త్రంతో పోల్చి చూస్తే ఒకే ఒక జీవితం బెటర్ టాక్ తెచ్చుకోగా తెలుగు రాష్ట్రాల వరకు కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న సంస్థలేవి అనే చర్చ కూడా అభిమానుల మధ్య జోరుగా జరుగుతోంది.ఒకే ఒక జీవితం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన సోనీ లివ్ దక్కించుకుంది.

ఆలస్యంగానే ఈ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.సినిమా యావరేజ్ రిజల్ట్ ను అందుకుంటే 8 కోట్ల రూపాయలు, హిట్ రిజల్ట్ ను అందుకుంటే 11 కోట్ల రూపాయలు ఇస్తామని సోనీ లివ్ సంస్థ షరతు విధించిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లను బట్టి ఓటీటీ రైట్స్ ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Advertisement

మరోవైపు బ్రహ్మాస్త్రం సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా కొనుగోలు చేయగా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇందుకోసం భారీ మొత్తం ఖర్చు చేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని శర్వానంద్ కు ఈ సినిమాతో ఆయన కోరుకున్న సక్సెస్ దక్కినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు గత కొన్ని నెలలుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి బ్రహ్మాస్త్ర సక్సెస్ ఒక విధంగా ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.అయితే అదే సమయంలో ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి.ఫుల్ రన్ లో బ్రహ్మాస్త్రం సినిమా పరిస్థితి ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు