''ఆకలిగా ఉన్న చిరుత కోసం ఎదురు చూద్దాం''.. 'ఓజి' నుండి అదిరిపోయే ట్రీట్ రాబోతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లైనప్ లో ఉన్న సినిమాల్లో ఓజి ( OG Movie )ఒకటి.

టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి.

పవన్ ఒకవైపు జనసేన పార్టీ పనులను చక్కబెడుతూనే మరో వైపు తన లైనప్ లోని సినిమాలను పూర్తి చేసుకుంటూ పోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.

ఇక మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుండడంతో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్టు టాక్.డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సెప్టెంబర్ 2న పుట్టిన రోజు జరుపుకోనున్నారు.ఈ బర్త్ డే కానుకగా ఈయన సినిమాల నుండి అప్డేట్స్ కోసం అంతా ఎదురు చూస్తుండగా వారం ముందుగానే ఓజి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.సరికొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ ట్రీట్ పై క్లారిటీ ఇచ్చారు.

ఫస్ట్ లుక్ లేదు.ఆకలితో ఉన్న చిరుత కోసం ఎదురు చూద్దాం అంటూ తెలిపారు.

దీంతో ఈ అప్డేట్ తో ఇది ఫస్ట్ లుక్ కాదు డైరెక్ట్ టీజర్ అని తెలుస్తుంది.ఈ పోస్టర్ లో పవన్ పిస్టల్ పట్టుకోగా ఆ చేతిమీద డ్రాగన్ టాటూ ఉంది.

మొత్తానికి పెద్ద అప్డేట్ నే మేకర్స్ ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

అలాగే ఈ సినిమాకు థమన్( Thaman ) సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు