జక్కన్న సెంటిమెంట్‌కు వెనకడుగు వేసిన మాంత్రికుడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు తారక్.

ఈ క్రమంలో త్రివిక్రమ్ తారక్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడా అనే సందేహం అందరిలో మొదలైంది.ఈసారి తారక్‌తో కలిసి త్రివిక్రమ్ ఎలాంటి ప్రయోగం చేస్తాడా అనే డౌట్ కూడా నెలకొంది.

కానీ త్రివిక్రమ్ ఈసారి ఎలాంటి ప్రయోగం చేయడం లేదని తెలుస్తోంది.దీనికి కారణం కూడా ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Advertisement

టాలీవుడ్‌లో రాజమౌళితో సినిమా తీసిన హీరోలకు తమ నెక్ట్స్ మూవీ అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచిన సెంటిమెంట్‌ను హీరోలు బలంగా నమ్ముతారు.దీంతో ఇప్పుడు తారక్-త్రివిక్రమ్ మూవీ కూడా ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ కేవలం ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయనున్నారు.

మరి ఈ సినిమా రాజమౌళి సెంటిమెంట్‌కు చెక్ పెడుతుందా లేక కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు