జక్కన్న కూడా చూపించని తారక్‌ను ఆ డైరెక్టర్ చూపిస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో తారక్ కొమురం భీం పాత్రలో తన నటవిశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో రెండోసారి ఓ సినిమా చేసేందుకు తారక్ సిద్ధమవుతున్నాడు.

NTR To Show His Full Capacity With Tamil Director, NTR, Vetrimaaran, Rajamouli,

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా ఓకే చేసే పనిలో పడ్డాడు తారక్.

ఈ క్రమంలో తారక్‌లోని విలక్షణ నటుడిని ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా ఓ డైరెక్టర్ చూపించేందుకు రెడీ అవుతున్నాడట.తమిళంలో తనదైన విలక్షణ చిత్రాలతో పేరుతెచ్చుకున్న దర్శకుడు వెట్రిమారన్, టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో కోసం ఆయన ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట.ఈ సినిమా కథను ముందుగా తారక్‌కు వినిపించాలని చూస్తున్నాడట ఈ డైరెక్టర్.

తారక్‌కు ఈ కథ నచ్చితే ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించాలని వెట్రిమారన్ ప్లాన్ చేస్తున్నాడట.ఈ సినిమాలో హీరో పాత్రలో తారక్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించేందుకు తాను రెడీ అంటున్నాడు ఈ తమిళ డైరెక్టర్.

తారక్‌తో పనిచేసిన డైరెక్టర్స్ ఇప్పటివరకు కేవలం యాక్షన్ హీరోగా మాత్రమే ఆయన్ను ప్రెజెంట్ చేశారని, కానీ తాను మాత్రం తారక్‌లోని మరో కొత్త యాంగిల్‌ను చూపించి ప్రేక్షకులతో ఔరా అనిపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.మరి వెట్రిమారన్ ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడంటే తారక్ కోసం ఆయన ఎలాంటి కథను రెడీ చేశాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ కాంబో నిజంగా సెట్ అయితే మాత్రం టాలీవుడ్‌లో మరో సెన్సేషనల్ మూవీ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమా త్వరగా పట్టాలెక్కితే బాగుండని తారక్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ .. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు