బాలయ్య రీమేక్ చేసిన తన తండ్రి సినిమాలేంటో తెలుసా?

ప్రస్తుతం అన్ని భాషల సినీ పరిశ్రమల్లో రీమేకుల కాలం నడుస్తోంది.ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది.

ప్రస్తుతం ఆ ట్రెండ్ కాస్త మరింత ఊపందుకుంది.నందమూరి బాలకృష్ణ డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు.

ఈ రీమేక్ సినిమాలు కూడా బాలయ్య కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.బాలయ్య రీమేక్ చేసిని సినిమాల్లో తండ్రి ఎన్టీఆర్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలను కూడా ఉన్నాయి.

ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాలయ్య నర్తనశాల

Advertisement

ఎన్టీఆర్ హీరోగా కమలకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో మొదలు పెట్టారు.సౌందర్య అకాల మరణంలో ఈ సినిమాను మధ్యలోనే ఆపేశారు.ఐతే.అప్పటి వరకు ఎంతైతే.ఈ సినిమాను షూట్ చేసారో.

ఆ సినిమాను ఏటీటీ ఫ్లాట్‌పామ్‌లో గతేడాది విజయదశమి కానుకగా విడుదల చేసారు.

పాండురంగడు

కమలకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం సినిమాను కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో పాండురంగడుగా రీమేక్ చేసారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది.

శ్రీకృష్ణార్జున విజయం

ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో కొంత భాగాన్ని బాలయ్య.సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో శ్రీకృష్ణార్జున విజయంగా రీమేక్ చేసారు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకోలేకపోయింది.

బైరవ ద్వీపం

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భైరవ ద్వీపం.ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవితో పాటు గులేబకావళి కథ, జగదేకవీరునికథ, రాజపుత్ర రహస్యం వంటి నాలుగు చిత్రాల్లోని కథను కొద్ది కొద్దిగా తీసుకొని ఈ సినిమాను తీశారు.బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నలిచింది ఈ మూవీ.

బ్రహర్షి విశ్వామిత్రా

Advertisement

ఎన్టీఆర్, బాలకృష్ణ హీరోలుగా ద్విపాత్రాభినయం చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా.అప్పట్లో ఎన్టీఆర్ నటించిన సత్య హరిశ్చంద్ర, శకుంతల సినిమాలను రెండింటి స్టోరీలను కలిసి బ్రహర్షి విశ్వామిత్రాగా రీమేక్ చేసి డైరెక్ట్ చేసారు ఎన్టీఆర్.ఈ సినిమాలో బాలయ్య.

సత్య హరిశ్చంద్రుడిగా.దుష్యంతుడిగా రెండు పాత్రల్లో నటించారు.

రాముడు భీముడు

ఇక ఎన్టీఆర్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రాన్ని అదే టైటిల్‌తో కాస్త డిఫరెంట్‌గా రీమేక్ చేసి మిశ్రమ ఫలితాన్ని అందుకున్నారు.

బాబాయి అబ్బాయి

ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ వద్దంటే డబ్బు సినిమాను.బాలయ్య కొద్దిగా మార్పులు చేర్పులతో జంధ్యాల దర్శకత్వంలో బాబాయి అబ్బాయిగా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు.

తాజా వార్తలు