‘కత్తి’ గురించి కత్తిలాంటి వార్త

తమిళ స్టార్‌ హీరో విజయ్‌, సమంత జంటగా మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కత్తి’.

రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఆ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి.

అందుకే డబ్బింగ్‌ చేసి విడుదల చేయలేదు.ఈ సినిమా రీమేక్‌లో పలువురు హీరోలు నటించనున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

చిరంజీవి నుండి ప్రభాస్‌ వరకు కూడా పలువురు ఈ సినిమాపై ఆసక్తి చూపించారు అంటూ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపించాయి.అయితే ఏ హీరోతో కూడా ఈ సినిమా ఇప్పటి వరకు ప్రారంభం అయ్యింది లేదు.

తాజాగా మరోసారి ‘కత్తి’ రీమేక్‌ గురించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ‘కత్తి’ని తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

నిర్మాత ఠాగూర్‌ మధు ఇప్పటికే వీరిద్దరితో చర్చలు జరిపాడని, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించేందుకు ఎన్టీఆర్‌ సూచన ప్రాయంగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.గోపీచంద్‌ మలినేని ప్రస్తుతం ‘పండుగ చేస్కో’ సినిమా ఫలితాన్ని బట్టి ‘కత్తి’ రీమేక్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

రామ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన ‘పండుగ చేస్కో’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.త్వరలో ‘కత్తి’ రీమేక్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు